16-11-2011 : శ్రీ హైమవతీదేవి జయంతి ఉత్సవముల సందర్భముగా విజయవాడ వాస్తవ్యులు శ్రీమతి మొవ్వ శేషుమణి (W/O. శ్రీ ఎమ్.వి.యస్.ఎ.ప్రసాద్) కన్నెపూజ చేసి చీరలు బహూకరించారు. శ్రీమతి శేషుమణి, నందమూరి రమణ, శ్రీవారణాసి ధర్మసూరి తదితరులు సహకరించారు.
27-11-2011 : హైదరాబాదు నుండి వచ్చిన నూతన దంపతులు చి||ల||సౌ|॥ ఎ.యల్.యస్. హైమ చి॥ విజయసారధి తమ తల్లితండ్రులు బంధుమిత్రులతో వచ్చి శ్రీ అనసూయేశ్వరాలయములో అనసూయావ్రతము జరుపుకొని అనంతరము అందరికీ విందుభోజనాలు ఏర్పాటు చేశారు.
30-11-2011 : శ్రీ చక్కా శ్రీమన్నారాయణగారు చేపట్టిన ‘శ్రీ హైమనిలయము’ పేరున నూతన గృహ సముదాయ నిర్మాణమునకు శంకుస్థాపన కార్యక్రమము శ్రీవాసుదేవానంద గిరిస్వామివారి నిర్వహణలో జరిగినది.
3-12-2011 : శ్రీ బి. కె.బి.వి.ప్రసాద్, తహసిల్దార్, తాడేపల్లి (గుంటూరుజిల్లా) పదవీ విరమణ అభినందన సదస్సు వారి బంధుమిత్రులు అభినందనలతో జిల్లెళ్ళమూడిలో జరిగినది. ఈ సందర్భంగా శ్రీ వాసుదేవానందగిరిస్వామి ఆశీస్సులు. బంధుమిత్రులు అభినందనలు తెలియచేశారు.
3-12-2011 నుండి 5.12-2011 వరకు నరసరావుపేట వాస్తవ్యులు శ్రీ బూదరాజు సుబ్రహ్మణ్యశర్మ శ్రీమతి అనంతలక్ష్మి షష్టిపూర్తి కార్యక్రమములు జిల్లెళ్ళమూడిలో అమ్మసన్నిధిలో జరుపుకున్నారు. ఈ కార్యక్రమములో వారి కుమారుడు వెంకటరమణ కోడలు జ్యోతిర్మయి కుమార్తె లక్ష్మీ సురేఖ అల్లుడు సీతారాం, మనుమలు, బంధుమిత్రులు ఈ కార్యక్రమమును చాలా ఘనంగా వేడుకగా నిర్వహించారు.
5-12-2011 : శ్రీమతి నాదెండ్ల భ్రమరాంబ అక్కయ్యగారి మేనల్లుడు విశాఖపట్నం వాస్తవ్యులు శ్రీ గుడిపూడి హరి, సి.ఎ., శ్రీమతి పూర్ణిమ దంపతులు జిల్లెళ్ళమూడిలో నాదెండ్ల లక్ష్మణరావు అన్నయ్య గారు గిఫ్ట్ గా ఇచ్చిన స్థలములో (అమ్మఒడి) అమ్మ అతిధిగృహమునకు శంఖుస్థాపన గావించారు.
ఈ శుభసందర్భముగా, శ్రీ బ్రహ్మాండం రవిఅన్నయ్య, గోపాలన్నయ్య, వసుంధర అక్కయ్య మరియు ఎస్.వి.జె.పి. కార్యవర్గసభ్యులు, ఈ కార్యక్రమములో పాల్గొని తమ శుభాకాంక్షలను తెలియపరిచారు.
10-12-2011 : జిల్లెళ్ళమూడి మాతృశ్రీ ఓరియంటల్ కాలేజీ పూర్వవిద్యార్థులు (2008-2009) రాగేష్, రవీంద్ర, వెంకటస్వామి, రామాంజనేయులు, కిషోర్, శ్రీకాంత్, సుబ్రహ్మణ్యం, వెంకటేశ్వర్లు, శివప్రసాద్, గణేష్ చక్రధర్, నాగలక్ష్మి మాలిని, సీతామహలక్ష్మి, లోహిత, మాధవి మొదలగువారు కంచి, త్రిపురాంతకం, సూర్యాపేట, హైదరాబాదు, తిరుపతి మొదలగు పట్టణములనుంచి వచ్చి అన్నపూర్ణేశ్వరి విద్యాప్రదాయిని అయిన అమ్మను అర్చించు కొని అనంతరం స్నేహపూరిత సంతోష వాతావరణంలో ఆవరణలోని వారికి విద్యార్థులకు, సందర్శకులకు అన్నప్రసాదవితరణ గావించారు.
11-12-2011 : సౌరహోమము జరిగినది. శ్రీ యస్. మోహనకృష్ణగారు శ్రీమతి రుక్మిణి మొదలైనవారు పాల్గొన్నారు.
14-12-2011 : సంకట హరగణపతి హోమము జరిగింది. ఈ కార్యక్రమములో శ్రీ యస్.మోహనకృష్ణ శ్రీమతి రుక్మిణి, శ్రీకె. చెన్నకేశవరావు, శ్రీమతి ఇందిర, దాసరి శ్రీధర్, శ్రీమతి రాజ్యలక్ష్మి నరసన్నపేట) పాల్గొన్నారు. గుంటూరు వాస్తవ్యులు శ్రీ రాచర్ల లక్ష్మీనారాయణ గారు శ్రీ నవనాగేశ్వరాలయము అర్చనలు జరిపించి, మకర తోరణము సమర్పించారు.
17-12-2011 : అన్నపూర్ణాలయ నూతన భోజనశాల నిర్మాణ నిమిత్తం ప్రస్తుతము వున్న రేకుల షెడ్డు తొలగించవలసి యున్నది. ఈ రోజు ఉదయం సుముహూర్తములో రేకుల షెడ్డు తీసివేయుటకు, కొత్త నిర్మాణమునకు నాందిగా పూజాకార్యక్రమము జరిగింది. ఈ కార్యక్రమములో శ్రీ గోపాలన్నయ్య, సంస్థ అధ్యక్షులు, కార్యదర్శులు ఆవరణంలోని అన్నయ్యలు, అక్కయ్యలు పాల్గొన్నారు.
18-12-2011 : ఏలూరు వాస్తవ్యులు శ్రీ సైదు ఉమామహేశ్వరరావు శ్రీమతి జయలక్ష్మి హైమవతీ వ్రతము జరుపుకున్నారు.