21-04-2011 : సంకష్టహర గణపతి హోమములో శ్రీయుతులు వి. ధర్మసూరి, యస్.మోహనకృష్ణ దంపతులు, భానుమతి, చి॥కౌశిక సుబ్రహ్మణ్యం, బోళ్ల వరలక్ష్మి, సరస్వతి, సీత పాల్గొన్నారు.
22-04-2011 : అనంతపురంజిల్లా పెనుగొండ తాలూకా సోమందెపల్లె నుండి వచ్చిన శ్రీయుతులు ఎమ్.నాగమ్మ (తాతమ్మ) ఎమ్. కులాయప్ప, శ్రీమతి లక్ష్మీదేవిల మనుమరాలు, శ్రీయుతులు రామకృష్ణాంజ నేయులు, శ్రీమతి అనిత తమ ద్వితీయ పుత్రిక చి॥నందిని పుట్టువెంట్రుకలు అనసూయేశ్వరాలయంలో సమర్పించారు. వీరు దాదాపు 40 సంవత్సరాలుగా అమ్మ దర్శనార్థం వస్తూ వున్నవారు. అమ్మ ఎడ ఎంతో నమ్మకం, అభిమానం, ప్రేమ గలవారు.
29-04-2011 : సరస్వతీ, లక్ష్మీ, విజయదుర్గ వ్రత ఉద్యాపన సందర్భంగా శ్రీమతి పొత్తూరి సుధారాణి, హైమవతీదేవి ఆలయంలో 9 మంది ముత్తయిదువులకు తాంబూలం సమర్పించి అన్నపూర్ణాలయంలో అందరికీ అమ్మ ప్రసాదం అందించారు. అమ్మ నామసప్తాహం ఈ రోజు ఉదయం శ్రీమతి పద్మావతిగారు హారతి ఇచ్చి ప్రారంభించారు. శ్రీశ్రీరాంగారు తమ భజన బృందంతో వచ్చి ఇందులో పాల్గొన్నారు. 78 సం॥ వయస్సులో వుండి “కూడా బాపట్ల నుండి వచ్చి హైమవతమ్మగారు పాల్గొన్నారు.
5-05-2011 : ఆలయాలలో అభిషేకానంతరం అన్నపూర్ణాలయవేదిక పై ఉ. 9-30 విశ్వజనని అనసూయాదేవి జగత్పిత శ్రీ నాగేశ్వరరావుగార్ల 76వ కళ్యాణం ఉ.8 గంటలకు 17 మంది వటువులకు కల్యాణ మంటపంలో ఉచిత ఉపనయనాలు జరిగినవి. దాదాపు 100 మంది వరకు కల్యాణంలో పాల్గొన్నారు. వఝ మల్లికార్జున ప్రసాదు దంపతులు, నందిరాజు హరికుమార్ దంపతులు, అన్నంరాజు వంశి దంపతులు, మోగులూరి రామచంద్రరావు దంపతులు వేదికపై కల్యాణంలో పాల్గొన్నారు. కల్యాణం అనంతరం మహానివేదన, ప్రసాద వినియోగం జరిగింది.
6-05-2011 : 29/4 నుండి 5/5 వరకు జరిగిన అమ్మ నామ సప్తాహం 6/5 ఉదయం మహాహారతి ఇచ్చి ప్రసాదవినియోగంతో సమాప్తి చేశారు.
8-05-2011 : శ్రీ మోగులూరి రామచంద్రరావు గారి మనుమడు, ఖమ్మం వాస్తవ్యులు మోగులూరి మోహన్, శ్రీమతి వరలక్ష్మిల పుత్రుడు చి||జగన్నాధ్ ఉపనయనం అమ్మ సమక్షంలో కల్యాణమండపంలో జరుపుకున్నారు.
9-05-2011 : బ్రహ్మాండం రవి దంపతులు,చి॥ చైతన్య దంపతులు, చి॥ శరత్చంద్ర దంపతులు అనసూయేశ్వరాలయంలో శ్రీ పి.యస్.ఆర్. గారి ఆధ్వర్యంలో అనసూయావ్రతం జరుపుకున్నారు. ముందుగా అమ్మకు మునిమనుమలు చి|| అఖిల్ శ్రీవత్స, చి|| నాగశశాంకలచే బంగారుపూలతో పూజ చేయించారు. తదనంతరం శ్రీ రవి అన్నయ్య శ్రీమతి వైదేహి మనుమళ్లకు అమ్మ సమక్షంలో బంగారు ఉగ్గుగిన్నెలో తేనె తినిపించారు.
12-05-2011 : జిల్లెళ్ళమూడి అమ్మ సేవాసమితి కాకినాడ నుండి శ్రీ చాగంటి వెంకట్రావుగారి ద్వారా అన్నపూర్ణాలయం భోజనశాల నిర్మాణమునకై రూ.80,000/ – విరాళం అందించబడినది.
హైమాలయంలో శ్రీమతి రాచర్ల కమల, కుమారి వారణాసి శుచి, శ్రీమతి సీత, శ్రీమతి సత్యవాణి -హైమవతీ వ్రతంచేసుకున్నారు.
13-05-2011: : అనసూయేశ్వరాలయంలో శ్రీమతి దొంతరాజు సత్యవాణి, శ్రీమతి వి. సీత, శ్రీమతి రాచర్ల కమల, కుమారి వారణాసి సుచి, శ్రీమతి శ్రీరంగమ్మ, చిరంజీవి ఆర్యన్ అనసూయావ్రతం చేసుకున్నారు.