మూలవు నీవమ్మా
జగన్మూవు నీవమ్మా
లీలవు నీవమ్మా
విశ్వ హేలవు నీవమ్మా
॥మూలవు॥
కన్నుల వెన్నెల నీవమ్మా
అన్నుల మిన్నవు నీవమ్మా
స్వరాల కిన్నెర నీవమ్మా
వరాల తెన్నువు నీవమ్మా
॥మూలవు॥
పవిత్ర మననము నీవమ్మా
సవితృ జననము నీవమ్మా
జగత్తు గమనము నీవమ్మా
శరత్తు రచనము నీవమ్మా
॥మూలవు॥
మన్నవ మాన్యత నీవమ్మా
అర్కపురి అసామన్యత నీవమ్మా
మహి మహిమాన్విత నీవమ్మా
ధర ఎద ధన్యత నీవమ్మా
॥మూలవు॥