1. Home
  2. Articles
  3. Mother of All
  4. అలనాటి దివ్య పరిమళాలు

అలనాటి దివ్య పరిమళాలు

N Ramadevi
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 16
Month : April
Issue Number : 2
Year : 2017

మా అమ్మ తన పుట్టిన రోజున శ్రావణమాసంలో – అమ్మకు ఒక చీర తీసుకుని పెద్దవిగా నేతితో చుట్టిన – సున్నివుండలు చేసుకొని అమ్మ చెంతకు వచ్చిందట. ఆ సందర్భంలో ఉష అక్కయ్య, బుద్ధిమంతుడు అన్నయ్య, వసుంధర అక్కయ్య మొదలగువారు వున్నారట. ఎంత కష్టపడి చేసి తీసుకొచ్చిందో చూడండి పాపం అంటూ – తాను కొంచెం రుచి చూసి, అక్కయ్యకు, అన్నయ్యకు చేరొకటి యిచ్చి వసుంధరా ఇవి నాన్నగార్కి యిష్టం. వానిని దాచి నాన్నగార్కి పెట్టమని చెప్పిందట. తరువాత కధ చూడండి. వీళ్ళ నాన్న కావూరి వెంకట రత్నంగారు. భార్య పోయి 40 సంవత్సరాలు. ఐనను మరల పెళ్ళి చేసుకోకుండా పిల్లల్ని చక్కగా పెంచి పెద్ద చేసి వివాహాలు చేసి ఒడ్డున పడ్డాడు. వరాల అమ్మమ్మగారి భర్త హరినారాయణరావుగారు. పి.డబ్లు.డి. ఇంజినీరు. ఆయన వద్ద వీరు ఆఫీసులో హెడ్ గుమాస్తాగా చేస్తారట. మా అమ్మకు మతి పోతోందట. మా తాతగార్ని అమ్మ చూడనే లేదు. తాతగారు అమ్మను ఎరుగరు. వాస్కోడిగామా అమెరికాకు దారి కనుగొన్నట్లు మా అమ్మ మొట్టమొదట అందరింటి ప్రవేశం చేసింది. ఆనాటికి మే మందరం చాలా చిన్న పిల్లలం. మా తాతగారు బాపట్లలో పని చేసినారట. ఈ మధ్యకాలంలో మా అమ్మ తాతగార్ని ప్రశ్నించిందట. నాన్నా మీకేమి జిల్లెళ్ళమూడిని గురించి తెలీదా అని. దానికి సమాధానంగా ఆయన వచ్చే వారమ్మా. గ్రామకరణం కదా. నెమ్మదిగా శాంతిగా వుండేవారు. పొలాలగట్ల పన్లు అవీ వుండేవి. బల్లమీద రూపాయి డబ్బులు పెట్టేవారట శ్రీ నాన్నగారు. మా తాతయ్యగారు తీసుకొనేవారు కాదట. ఎంతో మందికి ఉచిత సేవలు చేస్తానండీ. వద్దనే వారట మా అమ్మ అక్కచెల్లెళ్ళు 5 మంది. అందరూ వేసి వేయకుండా వున్నారు. ఐదు అంతస్తుల మేడ యిదీ అనే రీతిన వున్నారు. అందుకని మా అమ్మతో నీవు భక్తురాలివి – ఆ రోజుల్లో నాకు తెలీకుండానే నీవు నమ్మిన నీ దేముడి భర్త గారైన బ్రహ్మాండం నాగేశ్వర రావుగార్కి అంతులేని పన్లు చేసి పెట్టానమ్మా అని అన్నారట.

ఈ పదార్థం మంచంలో 95 వయస్సులో లేచి నడవలేని మా అమ్మ నాకు చెస్తోంది. అన్నం వుసిరి కాయంత తింటోంది. చూశారా ఆనాటి వారి ఆ గర్భంలోని ఆణిముత్యాలు పగడాలు వజ్రాలు. అందరం 60 సం||దాటి పోతున్నాయ్. ఆనాటి అచ్చటలే. ఈనాటి ముచ్చట్లుగా అయిపోయాయి. ఇంకా ముందు ముందు ఎలాగో తెలీడం లేదు. సరే అనే మంత్రం అమ్మది. అమ్మే చూసుకొంటుందిలే అనేది మన మంత్రం. ఇలాంటిదే మరో సంఘటన వినాయక చవితి పండుగ. 7 మానికలు బియ్యం రవ్వ తీసుకుని బయలుదేరింది మా అమ్మ. 7వ మైలు ఎవరూ లేరు. అపుడే అధరాపురపు శేషగిరిరావుగారు బస్సుదిగినారట. నేను పట్టుకొంటానని ఎలాగో చేర్చారు. భాగ్యమ్మగారు వండి వార్చి, వుండ్రాళ్ళుగా మలచి, అన్నపూర్ణాలయంలోకి పంపి వడ్డన చేశారట. అమ్మ మంచి పని చేశావని అన్నదట. మరో పర్యాయం చలిమిడి గుండిగ చేయించి. అమ్మకు చేర్చి అక్కడే పంచిపెట్టిందట. మా పెద్దక్క డాక్టర్ ఇందిర MBBS, M.D., Professor in Govt. Medical College. కడుపుతో వుంటే చేయించిందట. వియ్యాల వారు చాలా చాలా హై లెవెల్. మా మదర్ను ఎగతాళి చేశారట. అమె అమ్మవద్దకు వచ్చి కన్నీళ్ళ పర్యంతం అయిందిట. అమ్మ మంచి పని చేశావు అని చూపుడు వేలితో కొంచెం తీసికొని మిగిలింది ఇక్కడ కింద పంచమని చెప్పిందట. అలాగా అమ్మ మా మదర్ను ఓదార్చేసింది. ఇలా వ్రాస్తూ పోతే ఎంతైనా తరగని గని వలె వస్తూనే వుంటుంది.

మరోసారి మా అమ్మ వెళ్ళేప్పటికి శ్రీపాదవారు అమ్మతో సంభాషిస్తున్నారట. ఎంతసేపటికి ఆ వాదనలో అమ్మదే పైచేయి అయిందట. అమ్మా ఇంక నేను నీతో గెలవలేనని నమస్కారం పెట్టేశారట.

జిల్లెళ్ళమూడి వెళ్ళిన నాకు. ఆ Mother of All కనబడిందే అనుకోండి. అది ఎందుకు తెచ్చుకొన్నట్లు. తెచ్చానే పో ఉష అక్క నంబర్కు ఫోన్ నేను ఎందుకు చేసినట్లు. చేసితినే పో ఈ పని మరల అమ్మ నాకు ఎందుకు పెట్టినట్లు. అక్క 3 దశాబ్దాల అనంతరం ఆ గొంతులో ఆత్మీయానందం. ఏదో తెలియని ప్రేమతత్త్వం. అప్పట్లో మొసలి కంటి తిరుమలరావుగారు Railways Central Minister. నాకు చాలా చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఆమె Simpleness ఆలశ్య అమృతం విషం అన్న నేపథ్యంలో – రమా నీవు మా పత్రికకు వ్రాయవా విశ్వజననీ కుడికన్ను, Mother of All ఎడమ కన్ను అనడంతో నాయీ చిన్ని తరహా రచన వ్రాసి పంపక తప్పడం లేదు. అమ్మ విషయంలో వ్రాసినా భయమే. రాయకుండా తప్పించుకొన్నా భయమే. అమ్మ నా విషయంలో మన్నిస్తుందనే అనుకొంటాను.

తన కొనగోటితో కల్యాణ తిలకాలు దిద్దిన రాజరాజేశ్వరి ఐన అమ్మ మన జీవనం నడవడిక – ఏమిటో – ఆమెకే ఎరుక. నారదుడు తన మహతి. ద్వారా సిద్ధి పొందారు. గోపికలు కృష్ణుని మురళి వలన సిద్ధిపొందారు. నా కలం ద్వారా మీరు సిద్ధిని పొందుతారు. అంతా అమ్మాయై నమః.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!