(గత సంచిక తరువాయి )
ఏనాటికైనను అన్నపూర్ణ వెలసిన వారణాసినందునను మన “అన్నపూర్ణాలయ”
స్థాపన అర్కపురి సోదరీ సోదరులు యాకాంక్షయౌను గాత
5) అయిదు వత్సరముల నాడె “స్వర్ణధార” నుడివిన
ఆది శంకరులు మసలిన పుణ్యభూమి.
కాళికా మాతతో నిత్యము ముచ్చటాడిన శ్రీరామకృష్ణ
పరమహంస జననమంది రీ నేలపైనె.
గురుశక్తి తోన పాశ్చాత్య దేశములెల్లను
తన వాగ్ధారిన హెూరులెత్తించిన స్వామి వివేకానందులు
మన వంగభూమి వారె.
కొమ్మ కొమ్మలోన పర్ణపర్ణమునను జీవమేనని
చాటిన జగదీశచంద్రబోసును భరతమాత బిడ్డయేను.
మొదటి నోబుల్ విజేత “గీతాంజలి” స్రష్ట
రవీంద్రనాథులు గూడ మన యుత్తరాది వారె.
దత్తావతారమౌ “షిరిడి సాయియు”, అక్కల్కోటబాబా
అరవింద యోగులును దివ్యమాత గూడ తమ
వైభవమ్ము చాటిరీ నేలపైనె.
“నేనెవడను”యను శోధన జేయుటయె సకల
బాధలకును స్వస్తియని జాటిన “రమణులు” గూడ
ఈ నేలయందు వెలసిన “మహర్షి”.
సత్య శాంతి ప్రేమలే ఆధారంబుగ ఎంతో మహిమ
చాటి యనంతపుర దాహార్తి దీర్చిన “సత్యసాయి”
దైవమై నడయాడె నీదివ్య భూమి.
పైన వారందరకును “అమ్మ”నేనని జాటి చెప్పిన
“అనసూయ మాత” జిల్లెళ్లమూడి అమ్మ
మనకు కొంగు బంగారైయుంట మన యందరి భాగ్యఫలము.
6) ఆదియందు పెద్ద నమ్మికయే లేని యాసక్తి యాత్రికులు
ఆంజనేయ ప్రసాదుగారు “విశ్వజనని”కి ప్రథమ
సంపాదక సోదరుండు;
అమ్మ యొసగిన తాంబూల చర్వణ మహిమ
ఆశుకవితలాయన సంపదలైనాయి.
వీరి సోదరులు ప్రఖ్యాత శ్రీ సిద్ధేంద్ర పీఠాభిషక్తులు గూడ
అమ్మపై సాహస్ర వ్రాసినారు.
అమ్మ జీవిత సాగరం బందలి అలలలో తల
మునకలైనారు సోదరులు శ్రీ రామకృష్ణగారు.
పండితుడు గాని పండితుండు “భాస్కరన్నయ్య”
అమ్మకు సాక్షాత్ లేఖకుండు.
అమ్మ సౌధ నిర్మాణమందు ఇటుక లెత్తిన “రావూరి”
ప్రభృతులందరకు నేడు విశ్వమందంతట అమ్మ వీక్షణంబె.
సోదరీ సోదరులెందరి యనుభవాలొ
వీరి కెమెరానందు దాగిన గుప్త సిరులు.
ఉడుత భక్తిగ అమ్మకిచ్చినదంత వేయింతలై
మనకు వచ్చి చేరుట తధ్యమౌను.
– (సశేషం)