(గత సంచిక తరువాయి )
3) క్షేత్ర దర్శనములందు భోజనాల ఆరాట మన్న దొకనాటి మాట
నేడన్నచో ఏ దేవళమునందైన, నుచిత భోజన పధకాలు
యాత్రికులకెంతొ వెసులుబాటు
అన్నార్తులే లేరను అర్కపురీ వైభవమంత
జగతి ప్రతి ఆలయమందున విస్తరించె
దేవాదాయమందు యాత్రికుల అన్నార్తికొరకు
వెచ్చించుటన్న దెంతొ ముదావహమ్ము
“అన్నపూర్ణ” అనసూయ మాత సంకల్ప బలమది
భరతమాత యనునదే నౌక పెద్ద అన్నపూర్ణాలయమ్ము
ఆనాటి “తిరుమలాలయపు ప్రసాదు”గారికి
అమ్మ యొసగిన సూచనయె
ఈనాటి ఇట్టి యపూర్వ కానుకయై రూపమందె.
4) ఆంధ్ర రాష్ట్రమందు నదొక మారుమూల పల్లె
అన్నపూర్ణ అనసూయ చరణ రేణు మహిమనది నేడు విశిష్ట క్షేత్రమైపోయే
అచట అమ్మ హృదయ పుత్రికలు అన్నపూర్ణాలయ
నమూనాలు నేడు రాష్ట్ర రాష్ట్రాల శాఖ శాఖలై విస్తరించే
అర్కపురిన జరుగు పూజాదికములెల్ల జరుగుచునున్నవి.
విశాఖపుర మందు కుసుమ చక్రవర్తుల దివ్య ప్రేరణమ్మది
చెన్నపురమందునను “అమ్మ “ఆలయంబు ప్రతిష్ఠజెందె
యచ్చటి సోదరీసోదరుల యపూర్వ సంకల్ప బలాన
జిల్లెళ్లమూడి అమ్మసేవా సమితి అధ్యక్షోపాధ్యక్షుల
సారధ్య మందున అమ్మ విశ్వరూప సందర్శన
గాంచుచున్నారు వారి ప్రేమార్చనల రూపాన మన భాగ్యనగర మందు.
– (సశేషం)