1. Home
  2. Articles
  3. Viswajanani
  4. అవతారమూర్తి అమ్మ వైభవం

అవతారమూర్తి అమ్మ వైభవం

Pochiraju Seshagiri Rao
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 22
Month : July
Issue Number : 12
Year : 2022

1) అవని యందున అర్కపురికి క్షేత్ర వైభవ మందుట

మన్నవ గ్రామ జననమందిన అనసూయ మాత ప్రభావాన

సర్వులకును సర్వ స్వతంత్రమైన కూడలిని సంకల్పించె తన చిన్న తనాననె

ఇంటింట పిడికెడు బియ్యపు కూడిక అన్నపూర్ణాలయపు పునాది రాయియై పోయె

జిల్లెళ్లమూడిని కాలిడిన నాడె వారణాసీ వైభవ మందజేసినదీ “అమ్మ”

ఆగష్టు 15 దేశ స్వాతంత్ర్య మందిన నాడె

ఏబది ఎనిమిది ఆగష్ట్ 15న సకల మానవాళికి

ఐహికాముష్మిక స్వాతంత్ర్య మందజేసె

ఏనాటికైనను విశ్వ జన మంతయు

అమ్మ చరణ పునీత “అర్కపురిని” తరియించుట తథ్యమౌను.

అమ్మ నుడివినట్లుగ కొంత వెనుక ముందు భేదముగ

మోక్ష సోపాన మదియె మన “జిల్లెళ్లమూడి”

 

2) ఆనాడు “అమ్మ” సంకల్పించిన అన్నపూర్ణాలయమ్ము

ఈనాడు నగర నగరాన శాఖలై పరిఢవిల్లె

“అందరిల్లని” నామ మిడి మనల నందర నొక త్రాటగట్టె

కుల మతాల భేద మేమియు లేక

ఒకరి కొకరము అన్న లక్కలై పోయినాము

ఆదరించిన గృహ మదెల్ల “అర్కపురి”యేయని

చాటిన “అమ్మ” మాటమహిమ

ఒక కేశవన్నయ్య గాని, మరియొక రామచంద్రులు గాని

వాడ వాడల తమ గేహముల నారీతి మలచినారు.

తాలుమాటయే లేని అమ్మ వాక్కు మహిమ

త్వరలోనే విశ్వమంతయు అర్కపురి యౌట చూడగలరు

(సశేషం)

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!