(గత సంచిక తరువాయి )
7) పలుకునందునను వచో మాధురులు, భవ్యగాన మీ
సోదరుల సొంత ఆస్తి
హైమవతీదేవి వీరికి ఇంటి ఆడబడుచు
వార్షిక హైమ జయంతులు వీరింట చూసి
తరియించవలయు.
వీరి పుత్రిక, సోదరి “అనసూయ” యలంకరణమ్మున
హైమ వీరి గేహమందు సుప్రతిష్ఠ.
మరి యెవ్వరో గారు వీరె మన సోదరులు
శ్రీ తంగిరాల శాస్త్రిగారు, ఎన్నెన్నొ యనుభవాలు వీరికి నిత్య స్మరణ
వీరందరి సాహచర్య భాగ్య మబ్బుట మన
పూర్వ పుణ్య ఫలము.
పొర పొచ్చంబులేమి బొడసూపకుండగ
విశ్వజనని “అమ్మ” పదము జేరు దనుక
మన విశ్వ సోదర బంధ మీ రీతి సాగుగాత!
యనునదె నా యాకాంక్షయౌను.
8) జిల్లెళ్లమూడి ఖ్యాతి జగతి నిలుపు కొరకు
అమ్మ సృష్టియె మాన్య సోదరుడు శ్రీ రవీంద్రరావు.
ఒదిగియుంట లోనే ఎదిగియుండుట యన్న
నానుడికి అన్నయ్య తార్కాణమ్ము.
సోదరుడు వజ్రమని పిలిచిన సుబ్బరావన్నయ్య
వీరికి పెద్ద సోదరులౌట వారును బహు నిగర్వియేను.
వీరి శ్రీమతి శేషక్కయ్య. ఆలయమ్ములె
ఆమెకు ప్రాణ సమము. ధన్య వనిత,
మాయ యనునది మనయందరను జేరినను
దాని పట్టు జిక్కనంత సూక్ష్మ శక్తి మంతులనుట సత్య దూరంబు గాదు.
– (సశేషం)