కాకినాడలో వారింటికి వెళితే పుస్తక వల్మీకం మధ్య ఋషిలా గెడ్డంక్రింద చెయ్యి పెట్టుకుని ఏదో ఆలోచిస్తూ కనిపించే వారు. ఆ ఋషి యిక లేరంటే దుఃఖం పెల్లుబుకుతుంది.
ఎంత చెప్పినా ఎంత వ్రాసినా ఇంకా ఎంతో మిగిలిపోయే కవి, కథకుడు, నవలా కారుడు, వ్యాసకర్త, నాటక కర్త, గేయ రచయిత, తాత్త్వికుడు, అన్నిటికీ మించి అమ్మ భక్త కోటిలో అనర్ఘరత్నం.
పేరులో లక్ష్మీ ప్రసన్నులు అని ఉంది గాని అంతకు మించి వారు సరస్వతీ ప్రసన్నులు. అమ్మ మాటలు కావచ్చు అద్వైతం కావచ్చు, మాండూక్యం కావచ్చు, క్లిష్టమైన విషయాలను కూడా అలవోకగా చక్కని తెలుగులో చెప్పగల సాహితీవేత్త. ఆర్ష సాంప్రదాయాన్ని, అద్వైతాన్నీ, అమ్మ తాత్త్వికతను అందరికీ అంద చెయ్యాలన్న తాపత్రయం కనిపిస్తుంది వీరి రచనలన్నిటా.
ఆయన మాట తిరుగు లేనిది, మనసు మందారం, అంతరంగం అంబరం, పద్యం పాఠక హృద్యం, ఛలోక్తి చురకత్తి, కోపం అగ్ని శిఖ! పలుకు దారుణాఖండల శస్త్ర తుల్యము, మనసు నవ్య నవనీత సమము అన్న ఆర్యోక్తికి అక్షరాలా సరిపోయే వ్యక్తిత్వం శాస్త్రి గారిది.
అంతకు ముందు అమ్మ గురించి పత్రికలలో చదివినా, 1973 లో అమ్మ 50 వ పుట్టిన రోజు నాడు జరిగిన స్వర్ణోత్సవ సందర్భంగా జిల్లెళ్ళమూడి వచ్చి, ఆ కార్యక్రమాలలో పాలుపంచుకుని, మొదటిసారి అమ్మ దర్శనం చేసుకున్నారు. తదాది అమ్మ భక్తుడై అనుయాయి అయి జిల్లెళ్ళమూడి సంస్థలకు, గణ నీయమైన సేవా సహకారాలందించారు.
2011 లో జరిగిన అమ్మ తత్త్వచింతన సదస్సులో బహుకాలం తర్వాత కలసిన నాటి నుండీ, నా పై వారి పుత్ర వాత్సల్యసుధ రుచి చూస్తూనే ఉన్నాను. దానికి తోడు నాకున్న రవంత సాహిత్య వాసన మరింత చేరువ చేసింది. వారు మా నాన్నగారూ మంచి స్నేహితులు. ఇద్దరూ సాహితీవేత్తలు, జిజ్ఞాసువులు. వారి Coronation of the sandals MandukyoPanishad study అన్న గ్రంథాల రచనలో మా నాన్నగారి సలహా సహకారాల గురించి తరచు చెపుతూ ఉండేవారు.
“అమ్మ పుట్టుకతోనే బ్రహ్మభావాన్ని పొంది, సర్వసమర్థ అయి సర్వాత్మత్త్వ మహా విభూతి సహితంస్యా దీశ్వరత్వం సిద్ధి గాంచి, సకల చరాచరములకు జననిగా లోకపావనిగా వెలసి చెప్పినా తెలుసుకో లేని వెర్రి వెధవలమైన మనల్ని సాకి అన్నమిడి, పోషించి, మీ లేదు నాన్నా అన్నీ నేనే చూసుకుంటాను అని ఆశ్వా సించి, అందరికీ సుగతే కాస్త ముందూ వెనకా తేడా అంతే అని అభయ ప్రదానం చేసి వెళ్లింది” అంటారు అమ్మ గురించి చెపుతూ.
అమ్మ చెప్పిన ‘నేను నేనైన నేను’ ను తెలుగులో మహావాక్యం అంటూ సహేతుకంగా, సోపపత్తికంగా మహా వాక్యాల సరసన చేర్చిన పండిత శ్రేష్టులు. వారి ఆత్మ కథ “ఒక భోగి ఆత్మకథ అకాల మరణం చెందిన వారి కుమారుడు సోమసుందర రావు జీవిత కథ మొదలు పెట్టేరు. ఎంతవరకు వచ్చాయో తెలియదు. మీ ఆత్మకథ ముందు పూర్తి చెయ్యండి అని తొందర పెడితే అకర్మణ్యత్వంతో సతమత మౌతున్నానోయ్ అనే వారు. 80 యేళ్ళ వయసులో 50 యేళ్ళ (లుకేమియా ఫోర్త్ స్టేజ్ లో ఉన్న) కుమారుని కోల్పోయిన తండ్రిగా పడుతున్న వేదన నుంచి విషాదం నుంచి తేరుకొని చెయ్యవలసిన నేపథ్యం.
కాల గమనంలో కనుమరుగౌతున్న ఆ తరం పెద్దల ఔదార్యం, ఆప్యాయత, నిబద్ధతలకు సజీవ సాక్ష్యం శాస్త్రి గారు. ఆద్వైత సిద్ధాంతం మీద అనురక్తి, కంచి పరమాచార్యులపై భక్తి ప్రపత్తులు, ఒక మహా విద్వాంసునివద్ద వేదాంతశ్రవణ భాగ్యం, అమ్మ సాన్నిహిత్య, సేవా భాగ్యం పొంది ధన్యులై, పెంజీకటి కవ్వల వెలుగై కూర్చున్న అమ్మ సన్నిధికి వెళ్లి పోయారా బాబయ్యగారూ. రెండవసారి పితృవియోగాన్ని పొందినంత ఉద్విగ్నభరిత హృదయంతో, కంఠస్థంభిత బాష్పవృత్తి కలుషం – చిన్తా జడమై ఈ అశ్రుతర్పణం….