1. Home
  2. Articles
  3. Viswajanani
  4. ఆంజనేయప్రసాద్ గారికి అక్షరనివాళి

ఆంజనేయప్రసాద్ గారికి అక్షరనివాళి

Dr,Ramadugu Venkatesh Sarma
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 22
Month : March
Issue Number : 8
Year : 2022

P (పి)

1.సీ. పితృరూపమేకాక విదితఘంటగళాలు

 మంచిగా మూర్తీభవించువాఁడు;

“శ్రీనాథపీఠానఁ జెలఁగు సదస్సులం

 దన్నింట దానయైయలరువాఁడు; 

“జిల్లెళ్ళమూడి”లోఁజెన్నొందు “అమ్మ”ను 

అక్షరార్చనజేసి యడరు వాఁడు; 

“కుర్తాళపీరై”క“కులపతి”వర్యుల

కుడిభుజమ్మౌచును గొలుచువాఁడు

 “కాళిపీఠా”న జరిగెడి కమ్రకవన

 సభలలో నాకు స్థాన మొసంగువాఁడు; 

“గర్తపురి”ని “పీయస్సారు”గా వెలుంగు 

వానికిచ్చెద నివియె నా వందనములు”

S (యస్స్.)

అలవోకగాగఁ బ్రత్యహమును “జయహెూ! మా

తా!”యని నోరార ననెడివాఁడు; 

శక్తివంచనలేక జనులకు సుపకార

మొనరించు జీవవేదనగలాఁడు;

 సాహిత్యసత్కార్య సాధనమ్మన సార్థ 

కాభిఖ్యతేజమై యలరువాఁడు;

 అడుగునడుగునందు“అమ్మ”తత్త్వంబు చ

 రించంగ కడు నుత్సహించువాఁడు;

 పూజ్య“కులపతి” “యతి” సవ్య భుజ మతండు;

 “భువనవిజయాల” సాహితీకవనకలిత

 సభలు – శివరాత్రిప్రభలుగా జరుపువాఁడు;

 మాన్యగుణుఁడు – “పీ. యస్సారు”మహితసఖుఁడు 

కీర్తిశేషుఁడా? కవితకే స్ఫూర్తియెపుడు;

 వందనంబులు సాహితీ చందనములు”

  1. (ఆర్.)

3.4.

“అమ్మ”దనమ్ము తత్త్వము అనంతము; విశ్వజనీన దివ్యభా

 వమ్ముల సార్థకాఖ్యయగు పత్రికలో “ఎడిటోరియల్సు”గాఁ

 గమ్మగ వ్రాయ-వ్యాసముల గ్రంథముగానిటు తీర్చఁగా గరీ 

యమ్మగు కీర్తిపర్వమిది; అందగఁజేతు శుభాభినందనల్

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!