1. Home
  2. Articles
  3. Viswajanani
  4. ఆత్మసాధన

ఆత్మసాధన

S Sita Lakshmi
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 12
Month : August
Issue Number : 1
Year : 2012

సాధుకుడు తన మనస్సును అమ్మకు సమర్పణ చేస్తే జ్ఞాననేత్రం విప్పారి, ఆనందము పొందగలుగుతాము. కాని నాడు కోరికల వలయంలో చిక్కుకుని బాధలు అనుభవిస్తాడు. అందుకే మన అమ్మ శాక్తేయ సంప్రదాయంలో అమ్మని ఉపాసించే కుండలినీ యోగమార్గాన్ని మనకు అమ్మ నేర్పించింది. అది ఎట్లా? నిరంతరం నామస్మరణ జయహోమాత అని. జయహో అనే శబ్దంలో ఎంత పరమార్ధము ఎంత ఆనందం ఉంది. నామజపానికి మించిన ఉపాసన ఇంకొకటి లేదు. అందుకే నిరంతరం అక్కడ ఆ తల్లి సన్నిధిలో ఎటువెళ్ళినా, ఎక్కడ ఉన్నా చెవిలో మారుమ్రోగుతుంది. ఎంతటి మూఢుడు అయినా అనాలోచితంగా ఆ నామము మన గుండెల్లోంచి మన పెదిమలను తాకి శబ్దము ఏర్పడుతుంది. చదవటం రాని వాళ్ళకు కూడా కంఠోపాఠంగా పలికేటట్లుగా అలవాటువుతుంది. ఆ రోజులలో మన మధ్యనే ఆసీనురాలయి నోరు తిరగని వారి చేత కూడా నిత్యం చేయించింది. అదే మనకు ఉపదేశం. అదే నామం మనకు అన్నింటా అన్నింటికి కోరికలు తీర్చగల ఆయుధం. ధ్యాసే ధ్యానం అన్నది నిజమే. ఎప్పుడైనా లలిత చేసుకోలేదు. అంటే చదువుకోలేదు అమ్మాఅంటే ఆ ధ్యాసే నీ చేత ఆ సహస్రం చదివిస్తుంది అని అంటుంది అమ్మ. అలాంటి అమ్మ చేతుల మీదుగా ముద్దలు తిని, భోగిపండ్లు పోయించుకొని, గంధం అరగదీసి ఆ గంధాన్ని అమ్మ పవళించినపుడు ఆ పాదాలకి, కాళ్లకి వ్రాస్తూ ఉంటే ఆ రోజుల్లో పొందిన ఆనందం ఈ రోజుకి కూడా మనసు ని తృప్తి నా అంతటి అదృష్టం ఇంక ఎవరికి వచ్చింది. అని అనుకుంటే, నా లాగే ఎంత మంది అన్నయ్యలు, అక్కయ్యలు ఆ అనుభూతి పొందారో. గుడి అనేది ధామం, ధామం అంటే ఎల్లకాలమూ తను నివాస స్థలమని అర్థం. ఆమెతో పాటు ఆ భూమి ఉండే చోటుని కూడా ధామమని అంటారు. అలాంటి స్థలంలో ఎక్కడ నిలబడి చేసి ఆ నామం, ఆ నమస్కారము ఆ తల్లి పాదాల వద్ద చేరుకుంటుంది.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!