1. Home
  2. Articles
  3. Viswajanani
  4. ఆత్మ శాంతి ఎప్పుడు

ఆత్మ శాంతి ఎప్పుడు

T Chenna Kesava Rao
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 9
Month : July
Issue Number : 12
Year : 2010

కేశవశర్మగారికి నాకు షుమారు 25 సంవత్సరముల పరిచయము, వారు సత్యవాది, నిష్కపటి, యదార్ధవాది, పట్టుదలగల వ్యక్తి. వారి నుంచి నేర్చుకొనవలసిన విషయములు చాలా కలవు. అమ్మను నమ్మిన భక్తుడు ఎంత పెద్ద ఉద్యోగము చేసిన అంత వినయశీల, దానధర్మములు చేయుటలో ముందు వుండువారు. ఈ విధంగా ఎంత చెప్పిన తనవితీరదు.

వారు శ్రీచక్ర ప్రతిష్ఠకు చేసిన కృషి ఎంత అని చెప్పగలము. 75 సంవత్సరముల వయస్సులో ప్రతివ్యక్తిని స్వయముగా కలసి అందలి యదార్థ ఉపయోగములు సవివరముగా చెప్పి పండిత పామరులను ఒప్పించ పండితాగ్రేసరుడు. ఎండలనైనా వెన్నలవలె తలంచి శ్రమించి ప్రతివాడకూ వెళ్ళి, ప్రతివ్యక్తిని కలసిన పట్టుదల గల వ్యక్తి. ఇటువంటి వ్యక్తిని సంస్థ కోల్పోవడం దురదృష్ట కరము, విచారకరము.

సంఘసభ్యుల నుంచి, శాస్త్రవేత్తలనుంచి శ్రీ చక్రస్థాపనకు 3వంతులు మద్దతు సంపాదించిన మహ నీయుడు, మంచివాడు. ఆయన తనతోపాటు మరికొందరి సహకారముతో పరిపాలన కమిటి వారికి శ్రీచక్ర ప్రతిష్ఠ జరుపవలసినదిగా విన్నవించుకొన్నవాడు. దురదృష్టము కమిటీ వారు నేటికి ఏ చర్య జరుపలేదు. శర్మగారికి అదే అదే అదే ఆలోచన. ఒక 15 రోజుల క్రితం ఆవిషయం నాతో స్వయముగా చెప్పి వారి కోరిక విశదీకరించినారు.

ఆపద్ధర్మ అధ్యక్షులు శ్రీ రామబ్రహ్మం గారు ఇప్పుడైనా సరి అయిన నిర్ణయం చేయగోరుతారు. అప్పుడే వారి ఆత్మకు శాంతి. ఈ శాంతి కొరకు ఎదురు జూచుచు సెలవు.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!