ఆ చిరునవ్వు, ఆ సౌజన్యం
సౌహార్ద్రం, ఆ తత్పరత
కాన’రాము’ వేరెచ్చట
సాటిరారు నీకెవ్వరు!!
వయసు పండలేదు, మనసు నిండలేదు
అమ్మ సేవలోని తనివి తీరనే లేదు
చేయవలసినంతా ముందున్నదంతా!
తొంద రెందుకంత తల్లి చెంత చేర?
తెలియరాని దూరాలకు తరలిపోతి వీవు
నీ వెంట రాలేము, నిన్నొదిలి పోలేము
మరచిపోకు మమ్ము, మరలి వేగ రమ్ము
నూతనోత్సాహమ్ముతో, నూత్న తేజమ్ముతో!