22-04-2010 : రాచర్ల లక్ష్మీనారాయణ గారి కుమారుడు చిరంజీవి రహి కుటుంబ సమ్యేకం ఆలెళ్ళమూడి వచ్చి అన్ని ఆలయాలలో పూజ చేసుకుని ఆవరణలోని అందరికీ అమ్మ ప్రసాదం అందించారు.
22-04-2010 : శ్రీ వారణాసి ధర్మసూరి క్రొత్తకారు కొన్న సందర్భంగా జిల్లెళ్ళమూడి తీసుకు వచ్చి పూజ చేయించుకున్నారు.
23-04-2010 : శ్రీ వారణాసి ధర్మసూరి వారి సోదరులు శ్రీ వారణాసి సుబ్రహ్మణ్యం (రాజమండ్రి) నిత్యహోమములతో పాటు చండీహోమము శ్రీయుతులు ఉమాశంకర్ దీక్షితుల ఆధ్వర్యంలో జరువుకున్నారు.
23-04-2010 : విశాఖ పి. వెంకటేశ్వరరావు కుటుంబ సమేతంగా అనసూయేశ్వ రాలయంలో ఏకాదశి నాడు అనసూయావ్రతం జరుపుకున్నారు.
01-05-2010: సంకటహరగణేష్ హోమము రాచర్ల లక్ష్మీనారాయణ, శ్రీ ధర్మసూరి కుమారి సుచి చేసుకున్నారు. సాయంత్రం ప్రదోష కాలంలో గణపత్యాలయంలో అభిషేకం, వివిధ రకముల పూలతో పూజ జరిగింది.
05-05-2010 ఆలయంలో నిత్య అభిషేకానంతరం అమ్మ కల్యాణోత్సవం అందరింటి కల్యాణ వద్ద వైభవంగా జరిగింది. కల్యాణమూర్తులను ఊరేగింపుగా వేదిక వద్దకు చేర్చారు. శ్రీ యుతులు వై.వి. మధుసూదనరావు (స్థానిక కార్యదర్శి) శ్రీమతి లలిత వధువు తరపువ, శ్రీ యుతులు వల్లూరి రమేష్ ట్రెజరర్ శ్రీమతి హైమ వరుడి తరపున ఎదురుకోలలో పాల్గొన్నారు. వరుని ధీశక్తి మంచితనం గూర్చి శ్రీ పి.యస్.ఆర్.ఆంజనేయులు వర్ణించగా వధువు అందం, సర్వజ్ఞత్వం గూర్యి ఓరియంటల్ కాలేజి ప్రిన్సిపల్ శ్రీ సుబ్రహ్మణ్యశాస్త్రి వివరించారు. తదనంతరం అమ్మ, నాన్న గార్లను కల్యాణ వేదికపై ఆశీనులను చేశారు. శ్రీ వఝ మల్లికార్జునప్రసాద్ శ్రీమతి సీత, శ్రీయుతులు నరసింహరావు శ్రీమతి అనసూయ, డయాసు పై ఆశీమలు కాగా దాదాపు 68 మంది వేరుగా కూర్చుని అమ్మ నాన్నగార్ల కల్యాణంలో పాల్గొన్నారు. అమ్మ కల్యాణ మహోత్సవం వీక్షించటానికి దాదాపు 2000 మంది సోదరీ సోదరులు విచ్చేసారు. వివాహానంతరం ఆహ్వానితులైన అందరికీ అమ్మ ప్రసాదం అందించారు. శ్రీ పి.యస్.ఆర్. కళ్యాణ సందర్భంగా వ్యాఖ్యానం అందచేసారు. ఉదయం టి.టి.డి. కళ్యాణమండపంలో 5 గురు వటువులకు ఉచిత ఉపనయనాలు జరిగినవి.
కల్యాణానంతరం సాయంత్రం వేదికపై శ్రీరామరాజు ప్రేమకుమార్ ఆధ్వర్యంలో తిరుపతి అన్నమాచార్య ప్రాజెక్టు బృందంచే సంగీత విభావరి నిర్వహించబడినది.
12-05-2010 నూతలపాటి వారి పాలెం వాస్తవ్యులు శ్రీఉమ్మనేని సుబ్బారావు, శ్రీమతి లక్ష్మిల కుమార్తె హేమ సుధారాణి 15/5 వివాహ సందర్భంగా సుధారాణిని అమ్మ ఆలయంలో పెండ్లికుమార్తెను గావించారు.
12-05-2010 : ప్రతి మాసం వలె ఈనెల రాత్రి 9.30 నుండి 10.35 వరకు వాత్సల్యాలయంలో పిల్లల మట్టి సుబ్రహ్మణ్యం, శ్రీమతి పద్మావతి మహాసంకీర్తన చేశారు.
13-05-2010 : శ్రీయుతులు తంగిరాల కేశవశర్మ శ్రీమతి శారద తమ వివాహ స్వర్ణోత్సవాన్ని (50 సంవత్సరాలు) జిల్లెళ్ళమూడిలో అమ్మ సన్నిధిలో వైభవంగా జరుపుకున్నారు. 10-30 అమ్మ అందరింటి డయాసుపై అమ్మ విగ్రహం కరించి అసూయావ్రతం కుటుంబ సమేతంగా జరుపుకున్నారు. వ్రతానంతరం ఆవరణలోని స్త్రీలకు నూతన వస్త్రాలు బహుకరించారు. అందరికీ అమ్మ ప్రసాదం అందించారు. వ్రతకార్యక్రమాన్ని శ్రీ పి.యస్.ఆర్. నిర్వహించారు.
7-05-2010 నుండి 17-5-2010 : వివిధ ప్రదేశాల నుండి వచ్చిన విద్యార్థినీ విద్యార్థులకు సంస్కృత భాషా శిబిరం 10 రోజులు నిర్వహించబడినది.
16-05-2010 : సౌరహోమము జరిగినది.
17-05-2010 : రేపల్లె తాలూకా నుండి వచ్చిన కొప్పుల శ్రీ నాగమునీంద్ర, శ్రీమతి జ్యోతిలు తమ 6 నెలల బాబుకు అనసూయేశ్వరాలయంలో అన్నప్రాసన, నృసింహ కోటేశ్వర అనసూయేశ్వర్ అని నామకరణం చేశారు.
23-05-2010: శ్రీ కొండముది రామకృష్ణ అన్నయ్య మనుమరాలు శ్రీ కె. సుబ్బారావు శ్రీమతి శ్యామల ప్రథమ పుత్రిక శ్రీమతి నాగదీప్తి సీమంతం హైమాలయంలో ఉదయం జరిగినది. ఆహుతులకు అమ్మ ప్రసాదం అందించారు.
23-05-2010 : మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో అందరింటి వేదిక వద్ద తవ్వా ఆంజనేయులు గారి మనుమరాలు చి॥ లిఖితకు మేనమామ శ్రీ తవ్వా కృష్ణమూర్తి శ్రీమతి తవ్వా సీతాలక్ష్మిలు ఓణీలు ఇచ్చే పేరంటం చేశారు.
23-05-2010 నరసింహారావు గారు (మామయ్య) శ్రీమతి శేషు తమ కోడలు డాక్టర్ వాసవి (డాక్టర్ సిద్ధార్థ శ్రీమతి) సీమంతం హైమాలయంలో సాయంత్రం వైభవంగా జరిపారు. అందరికీ అమ్మ ప్రసాదం అందించారు.
25-05-2010 : శ్రీ పి.యస్.ఆర్. ఆంజనేయప్రసాద్ జన్మదినం సందర్భంగా ఆలయంలో పూజ చేసుకొన్నారు. అందరికి మహాప్రసాదం ఏర్పాటు చేశారు.
26-05-2010 : గోపాలన్నయ్య వ్రాసిన అమ్మ సన్నిధిలో నా అనుభవాలు – జ్ఞాపకాలు గ్రంథాన్ని శ్రీ కుర్తాళం : శ్రీయుతులు మన్నవ పీఠాధిపతులు శ్రీ సిద్ధేశ్వరానంద భారతీస్వామి ఆవిష్కరించారు. డాక్టర్ పొత్తూరి వెంకటేశ్వరరావు, మన్నవ బుచ్చిరాజశర్మ ఎమ్. దినకర్, డాక్టర్ సుగుణ ప్రభృతులు ప్రసంగించారు.
నేనూ మనస్సూ ఒక్కటే.