శ్రీ నాన్నగారి 110వ జన్మదినోత్సవం (17-10-22) నాడు జిల్లెళ్ళమూడిలో ఆలయ సముదాయానికి వెళ్ళే రహదారిలో కమాను ఆకారంలో ఆచ్ఛాదన (Arch type Shelter) ప్రారంభించబడింది.
ఇతః పూర్వం ఆచ్ఛాదన లేనందున సందర్శకులు ఎండకు ఎండి, వానకు తడిసి ఇబ్బంది పడేవారు. తెల్లని Polycarbonate sheetsతో నిర్మితమైన ఈ shelter చల్లని నీడ పట్టులా ఉంది. “శ్రీ వారణాసి సుబ్బరాయశాస్త్రి, శ్రీ రాచర్ల లక్ష్మీనారాయణగారల కుటుంబసభ్యుల సౌజన్యంతో 5 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించబడిన ఈ కట్టడంలో అమ్మసూక్తులను ప్రదర్శించవలసి యున్నది. అప్పుడు సంపూర్ణమగును” అని వివరించారు శ్రీ వి. ధర్మసూరి. ఈ కార్యక్రమంలో శ్రీ ఎమ్. దినకర్, శ్రీ టి.టి. అప్పారావు, వసుంధర అక్కయ్య, శ్రీ ఎమ్.వి.ఆర్. సాయిబాబు, శ్రీ వి.రమేష్బాబు ప్రభృతులు పాల్గొని హర్షం వ్యక్తం చేశారు.