1. Home
  2. Articles
  3. Viswajanani
  4. ఆవేదనే నివేదన

ఆవేదనే నివేదన

K B G Krishna Murty
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 10
Month : June
Issue Number : 11
Year : 2011

అవి 1960 దశకం తొలి రోజులు. రాత్రంతా అమ్మ దగ్గరే గడిపే రోజులు. ఒకరోజు రాత్రి దాదాపు 11 గంటలు 12 గంటలప్పుడు ఒక సోదరుడు అమ్మ దర్శనార్థమై వచ్చాడు. అమ్మ గది తలుపు తట్టాడు. తలుపులు తీసాను. అన్నయ్యా! అమ్మ దర్శనార్థమై వచ్చానని చెప్పాడు. ఈ టైములోనా అమ్మ దర్శనం అని నేను అనుకుంటూ అమ్మ ఇప్పుడే పడుకున్నారు. రేపు ఉదయం అమ్మ దర్శనం చేసికోండి అని చెప్పాను. ఆయన ఏమీ మాట్లాడలేదు. భోజనం చేస్తారా? అని అడిగాను. చేసే వచ్చానని చెప్పాడు. ఆయన వెళ్ళిపోయారు. రాత్రి దాదాపు 2, 3 గంటలౌతుంది. అమ్మ లేచింది. నాన్నా ! ఎవరన్నా వచ్చారా ? అని అడిగింది. ఎవరో ఒకాయన వచ్చి అప్పుడు దర్శనం కావాలన్నారు, ఉదయం రండి అని చెప్పాను అన్నాను. అయితే “వాడు ఎక్కడున్నాడో పిలుచుకొనిరా!”” అన్నది. అప్పటికి కరంటు లేని రోజులు. మన మెయిన్ బిల్టింగ్ స్లాబ్ కొచ్చింది. అన్ని గదులలోను ఖాళీ లేకుండా సెంట్రింగ్ పెట్టి వున్నది. ఎక్కడున్నాడో తెలియదు. చీకటిలో వెతుక్కుంటూ ఆ గదులవైపు తిరుగుతున్నాను. అందులో ఒక గదిలోనుండి వెక్కి వెక్కి ఏడుపు వినపడుతున్నది. మెల్లిగా వెళ్ళి ఆయనతో రాత్రి అమ్మ దర్శనం కోసం వచ్చిందీ మీరేనా ! అని అన్నాను అవును అన్నాడు. సరేరండి అమ్మదర్శనం ఇస్తానన్నారు. అన్నాను. ఆయన ఆనందానికి హద్దులు లేవు. ఆ వెక్కివెక్కి ఏడ్పూ కాస్త మాయమయింది. నన్ను అనుసరించాడు. అమ్మ మంచం మీద బాస పెట్టు వేసికొని కూర్చున్నది. ఆయన వచ్చి అమ్మ పాదాలకు నమస్కరించాడు. అమ్మ ఆయనను ఏమీ అడగలేదు. ఆయన అమ్మతో ఏమీ చెప్పలేదు. కాసేపు కూర్చొని వెళ్ళిపోయాడు. చూశారా ! ఆయన ఆర్ద్రత అమ్మను ఎట్లా లేపి దర్శనం ఇప్పించిందో. అటువంటి ఆర్ద్రతకు, ఆవేదనకు భగవంతుడు తప్పక లొంగుతాడు. అందుకే అమ్మ “ఆవేదనే నివేదన” అని అన్నదేమో!

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!