మా వైజాగ్కి తంగిరాల కేశవశర్మగారు, యల్.ఐ.సి.లో పనిచేస్తూ ట్రాన్స్ఫర్ మీద వచ్చారు. ఆయన్ని అమ్మ తన పనిమీద వైజాగ్ ట్రాన్స్ఫర్ చేయించింది అనే చెప్పాలి. వైజాగ్ ఆమెకు ఒక ముఖ్యకేంద్రంగా చేసుకోవాలి. అది ఆవిడ మాష్టరు ప్లానులో ఒక భాగం. ఆయన వైజాగ్ వచ్చినప్పటినుంచీ అమ్మ గురించే ఆలోచన. మరో ఆలోచనే లేదు. మా వద్ద డబ్బు వున్నా లేకపోయినా డబ్బు తీసుకుపోయి అనేకచోట్ల పూజాకార్యక్రమాలు నిర్వహించేవారు. నిస్వార్థి అంటూ ఎవరైనా వున్నారా అని గారినే చూపిస్తాను నేను. అందరూ బాగుంటే చూసి సంతోషిస్తాడు. ఆయన ఇంట్లో సరైన కుర్చీ బల్ల కూడా వుండదు.
2 నెలల క్రితం ఒకరోజు ఫోన్ చేశారు కేశవశర్మగారు. “స్వామీ ! నీకు ఒంట్లో బాగుండలేదుట చూడటానికి వస్తున్నానని” చాలా సంతోషించాను. అమ్మ బిడ్డల ప్రేమకు అవధులు లేవు అలాగని అందరూ అలా వుంటారా? లేదు. అదే కేశవశర్మగారి ప్రత్యేకత. ఆయనకు ఆయనే సాటి. నా భార్య కుసుమ కంటికి ఆపరేషన్ చేయించుకుంది, నేను చూస్తే ఇలా ఉన్నాను. అందుకేనేమో రాత్రి శరభలింగం గారింట్లో దిగి మర్నాడు ఉదయం 10. గంటలకు మా ఇంటికి చేరారు. ఆయన ఉన్నంత సేపు చాలా చక్కగా కష్టసుఖాలు ముచ్చటించుకున్నాం. నేను ఆఫీసుకు బయలుదేరాను, ఆయన నన్ను వారించారు. ఆరోగ్యం బాగా చూసుకో మీ షర్టు గుండీ సరిగా పెట్టుకోవయ్యా ఎంత చిక్కిపోయావో చూడు. ఆ ఛాతి. ఎండిపోయింది జాగ్రత్త” అని ప్రేమ తిట్లు. నేను చలించిపోయాను. ఆయన మధ్యాహ్నం తిరిగి బాపట్ల వెళ్ళిపోయారు.
మే నెలలో కుసుమ మా దగ్గర బంధువుల పెళ్ళికి చెన్నై వెళ్ళింది. వచ్చేటప్పుడు బాపట్లలో దిగి జిల్లెళ్ళమూడిలో ఒక పూట వుండటానికి అన్ని ఏర్పాటు జరిగిపోయాయి. కానీ ఆ రోజు మే 26 పినాకినీ బాపట్ల 7-30కి రావల్సింది 2 గంటలు లేటు. చీకట్లో ఒక్కతే జిల్లెళ్ళమూడి వెళ్ళటం ఎందుకని శర్మగారికి ఫోన్ చేశాను” నీ కెందుకయ్యా నేను చూసుకుంటాను, నిశ్చింతగా వుండు” అని అభయమిచ్చారు శర్మగారు. అదే నేను ఆఖరి సారి ఆయనతో మాట్లాడటం పట్టుమని పదిరోజులు కాకుండా తొందరపడి వెళ్ళి అమ్మలో … ఆషాకు నుంచీ తిప్పుకోవటం చాలా కష్టమైపోయింది.