1. Home
  2. Articles
  3. Viswajanani
  4. ఉదయమిదే! మాతృశ్రీ శతవసంత మహోదయమిదే!!

ఉదయమిదే! మాతృశ్రీ శతవసంత మహోదయమిదే!!

D V N Kamaraju
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 22
Month : May
Issue Number : 10
Year : 2022

అమ్మ ఆగమన శతవత్సర శుభవేళ

అణువణువూ పులకించిన అవని పరమానందంతో పరవశిస్తున్నది.

అమ్మ కరుణ మందాకినీ ప్రవాహమై పొంగిపొరలి సమస్త భువనాలనూ తడిపివేస్తున్న శుభవేళ.

అమ్మ వాత్సల్యదీప్తి సోమసూర్యాగ్ని తేజోభూతమై సకల భువనాలలో ప్రకాశిస్తున్నది.

అమ్మ చల్లని చూపుల మంద మలయానిలాలు పదునాలుగు భువనాల తాపోపశమనాలు.

ఆకాశమంతా అమ్మ రూపమై విశ్వమంతా విస్తరించిన మహోదయ వేళ,

అమ్మ శతజయంతి మహోత్సవం పంచభూతాలకూ, సమస్త జగతికీ నేత్రోత్సవం.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!