ఎంత గొప్ప ఆశయమమ్మా!
ఎంత మంచి ఆశ్రయమమ్మా !
“అందరిల్లు” నెలకొల్పావు
“అందరమ్మ”గా వెలిగావు. ॥ఎంత॥
పిడికిలంత నీ ప్రారంభం
పరుగులిడెను నీ ప్రాభవము
పయోనిధీ సంరంభం
పాలపుంత నీ వైభవము ॥ఎంత॥
విశ్వజనని నీ అనురాగం
విశ్వప్రేమ విపంచిరాగం
నీ శిక్షణ భానుని చరణం ॥ఎంత॥
నీవీక్షణ జాబిలికిరణం
అలతి అలతి పద సంభాషిణి
ఆత్మ కాకు దివ్యాకర్షిణి
ఎంత మంచి అమ్మనమ్మ!
ఏలోకపు బొమ్మనమ్మ! ! ॥ఎంత॥