నీ మమతల పందిరి నీడలో
నీ పదాల వెలుగుల మేడలో
నిర్మలమై నిర్వికారమై
నిలచే భాగ్యము ఎవరికొలే !
కరుణామృత సాగర తీరములో
ప్రేమాన్విత స్పర్శానందములో
పెదవులదర ఎదవణక నిలచి
నిను పిలిచే భాగ్యము ఎవరికొలే !
నీ కన్నుల నీలిమ లోతులలో
నీ పెదవుల నవ్వుల వెన్నెలలో
మోద భేదముల నడుమ నిలచి
నిను కొలిచే భాగ్యము ఎవరికొలే !