అమ్మా ఏమని అడిగేది : నిన్నేమని అడిగేది
అమ్మా ఏమని అడిగేది : నిన్నేమని అడిగేది :
చేతలు నీచేతిలో లేవంటివి
అనుకున్నది జరగదు, తనకున్నది తప్పదంటివి :
అమ్మా ॥
శిక్షణ కూడ రక్షణే నంటివి
నిర్ణయానికి నిర్ణయించినవాడూ బద్దుడే నంటివి :
అమ్మా ॥
మీరు కానిది నేనేది కాదంటివి :
అంతా అదే : ఉన్నదంతా అదేనంటివి :
అమ్మా ॥
నన్ను చూస్తేనే చాలంటివి :
తోలు నోరు కాదు కదా : తాలుమాట రావటానికంటివి
అమ్మా ॥
అమ్మా : ఏమని అడిగేది : నిన్నేమని అడిగేది :
అమ్మా : ఏమని అడిగేది : నిన్నేమని అడిగేది :