1. Home
  2. Articles
  3. Viswajanani
  4. కడదాక మము నడుపుమా…

కడదాక మము నడుపుమా…

Pogula Srinivasarao
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 13
Month : April
Issue Number : 9
Year : 2014

మన్నవలో మానవిగా వెలసిన మాధవి

మమత సమత కలబోసిన బాంధవి
అర్కపురికి అరుదెంచిన అపర్ణ

అవనిని నడయాడిన అన్నపూర్ణ

॥మన్నవ॥

ప్రాణికోటి సర్వము నీ ప్రియ సంతు

ప్రాపంచిక పర్వము మాకు మాయతంతు

విశ్వప్రేమల వరపుత్రిక విశ్వజనని శుభపత్రిక

కలువల కనుదోయిడోల కడదాక మము ఊపుమా

॥ మన్నవ॥

నీ అధరాల వెలిగే అమృతవాక్కులు

భవతిమిర విదూరమౌ అద్భుత ఋక్కులు

అభ్రపధపు మణిదీపిక సంభ్రమ తారానవమాలిక

కరముల మాకరముపట్టి కడదాక మము నడుపుమ

॥మన్నవః॥

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!