1. Home
  2. Articles
  3. Viswajanani
  4. కదలివచ్చిన కలికి అనసూయ

కదలివచ్చిన కలికి అనసూయ

Prabhakara Ramalakshmi
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 11
Month : June
Issue Number : 11
Year : 2012

ఘల్లు ఘల్లున పాదగజ్జెలందెలు మ్రోగ 

కలికి అనసూయా కదలివచ్చింది. 

మాతల్లి అనసూయా కనికరించిందీ.

 చల్లని చిరుజల్లులు కుమ్మరించిందీ 

ప్రేమ జల్లును కుమ్మరించిందీ.

 ఎల్లలే లేని ఆ కన్నతల్లీ కరుణ

 ఆ పల్లెనే వ్రేపల్లెగ మార్చుకుందీ

 అల్లనల్లన గోపభామలను దరిజేర్చి

 మెల్ల మెల్లగా శ్రీకృష్ణుడే తానంది 

అనంద మొలకబోసింది.

అన్నమూ మాగాయ వెన్న మీగడ పెరుగు

 పల్లవపాణి తన బిడ్డలకు పంచిపెట్టింది

 — అనురాగ పూర్వక అంచులను చూపించి 

పిన్న పెద్దల నెల్ల ఆదరించిందీ

మోదమిచ్చింది.

ఆకలే విలసిల్లు కలియుగమ్మూ లోన 

అన్నపూర్ణగ నిలచి కడుపులో నింపింది

 కలిమాయ పోగొట్టి కల్పవృక్షమై నిల్చి

 అర్కపురి కేంద్రముగ లోకాలనేలింది

 శ్రీరాజరాజేశ్వరి అమ్మ శ్రీ లలితాపరమేశ్వరి

||ఘల్లు||

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!