‘అమ్మ’ శతజయంతి ఉత్సవ వేడుకలలో భాగంగా 27-10-22 గురువారం రాత్రి 7 గంటలకు నరసరావుపేట వద్ద ‘కనపర్రు’ గ్రామంలో బాబావారి ఆలయ ప్రాంగణంలో స్థానిక సోదరి శ్రీమతి ప్రమీల గారి సహకారంతో సామూహిక అనసూయావ్రతాలు నిర్వహించబడ్డాయి.
వేద పండితులు శ్రీ ఎమ్. సందీప్ శర్మ పూజ, లలితాపారాయణ, వ్రత విధానాన్ని నిర్వహించారు. SVJP Temples Trustee శ్రీ చక్కా శ్రీమన్నారాయణగారు వ్రతకథల్ని చదువుతూ సందర్భానుసారంగా అమ్మ ప్రేమతత్వము, అమ్మ అవతార పరమార్థం, అమ్మ ఆచరణాత్మక ప్రబోధం, అమ్మ స్థాపించిన సేవాసంస్థల గురించి వివరించారు.
SVJP Temples Trust వారి సౌజన్యంతో భక్తులందరకు అమ్మఫోటో, అమ్మ ప్రసాదం, అమ్మ సాహిత్యం, అందజేశారు. ఆహ్లాదకర పవిత్ర వాతావరణంలో 100 మంది సోదరీమణులు శ్రద్ధాసక్తులతో ఈ వ్రతాచరణలో పాల్గొని పరమానందభరితులయ్యారు.
– SVJP TEMPLES TRUST