అమ్మ లేని, నాకు అమ్మవైనావు అమ్మా నీవు,
కష్టాల కడలిలో, కన్నీళ్ళతో నీ దరి, నే చేరితినమ్మా॥
నీ దరిచేరంగా, నీ ఒడి చేర్చి, లాలించి
నా హృదయవేదన తీర్చినావు. నా బంగారు అమ్మా!॥
నాకు స్వాంతన చేకూర్చితివమ్మా, అట్టి నిన్నునే మరువగలనా!
నీవే తల్లివి తండ్రి అంతయు నీవే;
నాకు నీవు వున్నావని ‘నే మురియుచుంటినంతలోనే
కనుమరుగు అయినావమ్మా మమ్మల్ని తీరని కన్నీళ్ళలో ముంచి॥
ఎచటికో దూరదూరతీరాలకు, మేము చేరుకోలేని తీరాలకు।।
మరల రావమ్మా! అమ్మా॥ మమ్ము ఆనందాబ్ధి నోల లాడించంగా||
అమ్మా ! నీకై ఎదురు తెన్నులు చూచుచుంటిని నీకై వెయ్యి
కన్నులతో అమ్మా! అమ్మా! అమ్మా!