అమ్మ కరుణామయి. అమ్మ అంటే ఎవరికి అమ్మ. ఈ అవనికే అమ్మ మన అనసూయమ్మ. ఈ సృష్టిలోని ప్రతి జీవరాశికి, ఈ యావజ్జగతికి అమ్మే. రాగద్వేష అసూయలను పారద్రోలి ప్రేమామృతాన్ని పదిమందికి పంచటానికి పృధివిపై అవతరించిన పవిత్రమూర్తి.
పవిత్ర ప్రేమకు నిర్వచనము తల్లీ బిడ్డల మధ్య ఉన్న ఆ ప్రేమబంధమే. అమ్మ చిన్నతనం నుండే ఎవరు బాధలలో ఉన్నా చలించిపోయి, అయాచితంగా తన దగ్గర ఉన్న వస్తువులను, ఆఖరికి తను వేసుకొనే బట్టలను సైతం, బట్టలు లేని పేదపిల్లలకు దానం చేసేది. అలాగే తన దగ్గర ఉన్న బంగారు ఆభరణాలను ఎంతో మందికి ఆపద సమయాల్లో ఇచ్చి వేసింది. తను ఎప్పుడూ బిడ్డల యొక్క కడుపునింపడం గురించే తప్ప, మరో ఆలోచనే లేదు. మిమ్ము కన్నతల్లిని నేనే అని చాటినది నీవే అదే అమ్మ సాధన. ఈ సృష్టిలో ఏ జీవి ఆకలితో బాధపడకూడదు. ఆకలి బాధ భరించడం చాలా కష్టం. అందుకే అమ్మ అన్నపూర్ణాలయాన్ని ఆగష్టు 15వ తేదీన విశ్వమంతా నిండి ఉన్నది నీవే స్థాపించి సర్వులకు స్వతంత్రమైనదిగా ప్రకటించింది. ఇక్కడికి రావటానికి ఆకలే అర్హత అన్నది. నేను తల్లిని కలత లెన్ని ఉన్నా, పోగొట్టేది నీవే మీరు బిడ్డలు అని తన అపారమైన ప్రేమను అన్న ప్రసాదరూపంలో తన దోసిళ్ళలో కుమ్మరించింది. ఆ కరుణామూర్తిని ఆశ్రయిస్తే కష్టాలు, నష్టాలు కనుమరుగు అవుతాయి.
అమ్మ చిన్నతనం నుండి ఎంతో మంది బిచ్చగాళ్ళకు అన్నం పెట్టింది. ఏ ఆసరా లేని అనాధలకు, వృద్ధులకు కొన్ని రోజుల పాటు సేవచేసింది. తను పెట్టించుకున్న అన్నం, పందులకు, కుక్కలకు పెట్టేది. సకల జీవరాశిపైన నిష్కల్మషమైన ప్రేమను చూపించింది. చూచిన ప్రతివారికి మరచిపోలేని మధురానుభూతులను ఎన్నో మిగిల్చింది. జాతి, కుల, మత విభేదాలు మరిచి విశ్వకుటుంబ భావనతో అందరూ అన్నదమ్ములవలె కలసి మెలిసి జీవించమని, వివేకాన్ని కలిగించింది, తన యొక్క సందేశాన్ని విశ్వజననియై విశ్వవ్యాప్తం చేసింది.
Where there is strong belief in God, there is no anxiety. అందుకే విశ్వాసము ఎంతో బలమైనది. అది మనల్ని భగవంతునికి దరికి చేర్చును. బాధల నుండి విముక్తులను చేసి, దారి చూపిస్తుంది. ఆ పరమాత్మ యొక్క దయకు మనలను పాత్రులయ్యేటట్లు చేసి, మన పాత్రకు పరిపూర్ణత్వాన్ని చేకూరుస్తుంది. అడుగడుగనా మనకి ఉత్తేజాన్ని, మనస్సుకి శక్తిని ప్రసాదిస్తుంది. అందుకే మనం దైవం యొక్క రూపాన్ని మరువకూడదు. నిత్యం ఆరాధనాభావంతో, అందరినీ దైవస్వరూపంగా భావించాలి. అమ్మా! అందరికీ నీవే అమ్మ, అన్నింటికీ కూడా
ఈ కలిలో అందరూ కలసి మెలిసి అన్నదమ్ములవలె మెలగాలి.
ఆత్మజ్యోతివి నీవే
మమతానురాగాలను పంచిన మాతృమూర్తినీవె,
ఈ జగత్తులో అందరికీ సుగతి అన్న తల్లివి నీవే,
నవనాగరిక జీవితాలకు
నవజీవన నిర్మాతవు నీవే
విశ్వజనని నీవె, వాదనలేని సమాధానంనీవే
ప్రతి కదలికనీవే, ప్రతి కథలో నీ స్మృతులే
అమ్మా! జయహోమాతా, శ్రీఅనసూయ, రాజరాజేశ్వరి, శ్రీ పరాత్పరి
ఏ దేవాలయానికి వెళ్ళినా నా నాలుక పలికేది జయహోమాతా
నా మదిలో నిలిచేది, నీ రూపమే,
ఆనందంతో, పరవశించేది నీ దర్శనంతోనే,
అన్నింటా నీవే, అందరిలో నీవే.
అందుకే నీకు నీరాజనాలు.
ప్రణామాలు, శతకోటి దేవతలు నిన్ను కొలిచేరు.
నాగేశ్వరుడే నీ పతిదైవము
పాతివ్రత్య మహిమను చాటిన తల్లివి
అమ్మలకన్న అమ్మవు నీవే
అందరి తల్లులకు అమ్మవు నీవే
మూలపుటమ్మవు నీవే
మాతృమూర్తివి నీవే
మాయజగతిని మేల్కొల్పిన తల్లివి నీవే.