నా మనసు లోన కొలువైన మా తల్లి
నిన్ను మరువగలదా నిమిషమైన ఈ మనసూ
అమ్మా! అమ్మా! యనుచూ
నీ మంత్రం జపించును
అమ్మా ! అమ్మా ! యనుచూ
నీ కొఱకే తపించును…..!!
చెరగని నీ రూపానికి గుడిని కట్టు చున్నది.
నిత్యము నీ ధ్యానంతో పరవశించు చున్నది.
అన్నక్రతువు చేయుటే నీ సేవనుచున్నది.
నీ నామం చేసినచో బ్రతుకు ధన్య మన్నది!!
ఆలోచన వీక్షణలే ఈ మనసుకు లోచనాలు
సతమతమౌ సమస్యలే ఈ మనసుకు బంధనాలు
అంతరంగ శత్రువులే కామ క్రోధ లోభాదులు
కరుణ చూపు ఈశ్వరీ! ఈ మనసు కుదుట పడగా!!