– అమ్మ
“కరుణ లేకపోతే మనము లేము. మనము చేసే పనులన్నీ కరుణ వల్లనే. నా దృష్టిలో కష్టసుఖాలు రెండూ కూడా కరుణవల్లనే. ప్రతి చిన్నపనీ మన చేతులతో చేస్తున్నామనుకున్నా, మనం ఎట్లా చేసినా వాడి కరుణ వల్లనే. మనకు కనపడకుండా ఆయా తరుణాల్లో ఆయా పనులు చేయించటమే కరుణ. కరుణ సముద్రం అల వంటిది. ఆ తరంగానికి తరుణం వచ్చినప్పుడు నీరే తరంగమౌతుంది. ఎక్కడో ఒక చోట పుట్టి కొండలాగా పెరిగి లయమౌతుంది. ఒక్కొక్క అల ఎక్కడ నుండో వస్తున్నట్లు ఉంటుంది. ఒక్కొక్కటి దగ్గరలోనే పుట్టినట్లు ఉంటుంది. ఇంతకూ నీటికి గాలి ఒరిపిడేగా, అల అంటే.”