1. Home
  2. Articles
  3. Viswajanani
  4. కళాశాలలో ప్రత్యేక సమావేశాలు

కళాశాలలో ప్రత్యేక సమావేశాలు

Editorial Board - Viswajanani
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 11
Month : September
Issue Number : 2
Year : 2010

14-07-2010 : పోతన భాగవతంలో “వామన చరిత్ర” కథాంశాన్ని, పోతన్న కవితా విశేషాలనూ వివరిస్తూ జూలై 14వ తేదీన అధ్యాపకులు శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తిగారు ప్రసంగించారు. విశ్రాంత అధ్యాపకులు శ్రీ ఐ. హనుమబాబుగారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

04-08-2010 : శ్రీకృష్ణదేవరాయల పట్టాభిషేక పంచశతాబ్ది మహోత్సవాల సందర్భంగా కళాశాలలో సమావేశం జరిగింది. బాపట్ల ఆర్ట్స్ & సైన్సు కళాశాల చేశారు. తెలుగు రీడర్ డాక్టర్ యు. వరలక్ష్మిగారు “ఆముక్త మాల్యద” కావ్య విశేషాలను వివరిస్తూ, చక్కని విశ్లేషణాత్మకమైన ప్రసంగం చేశారు. కథాకథనంలో, వర్ణనలో, పాత్రచిత్రణలో, సన్నివేశ కల్పనలో, పదప్రయోగంలో రాయల వారి ప్రతిభను డాక్టర్ వరలక్ష్మిగారు ఆవిష్కరించారు.

కళాశాల తెలుగుశాఖ అధ్యక్షులు శ్రీమతి డాక్టర్ బి.ఎల్.సుగుణగారు సభకు అధ్యక్షత వహించి, రాయల కవితా వైభవాన్ని ప్రస్తుతించారు. మాతృశ్రీ విద్యాపరిషత్ కరస్పాండెంట్ శ్రీ వఝా ప్రసాదరావుగారు, సెక్రటరీ శ్రీ ఎన్. లక్ష్మణరావుగారు సభలో పాల్గొని, డాక్టర్ వరలక్ష్మిగారిని అభినందించారు. ఈ సందర్భంగా కళాశాల పక్షాన సభాధ్యక్షులు డాక్టర్ వరలక్ష్మిగారిని శాలువతో సత్కరించారు. 

17-08-2010 : 18వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు కళాశాలలో ప్రత్యేక సమావేశం జరిగింది. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. సుబ్రహ్మణ్యేశ్వరశాస్త్రిగారు “వామనచరిత్ర” తులనాత్మక పరిశోధన ప్రసంగం చేశారు. ఆ కధలో అంతర్గతంగా దాగివున్న సాహిత్య, ఆధ్యాత్మిక, వైజ్ఞానిక శాస్త్రీయ అంశాలను డాక్టర్ శాస్త్రిగారు సప్రమాణంగా నిరూపించి, సభ్యులను మంత్రముగ్ధులను చేశారు. సభలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న శ్రీ విశ్వజననీ పరిషత్ ఉపాధ్యక్షులు శ్రీ ఎం.దినకర్ గారు ఏకలవ్యుని వృత్తాంతాన్ని, వామనావతార విశేషాలను సహేతుకంగా ప్రత్యేక నిరూపించారు. శ్రీ ఐ. హనుమబాబుగారు వందన సమర్పణ చేసారు. 

శ్రీ చక్కా వారి వితరణ

15-08-2010 : ప్రతి సంవత్సరం మాదిరిగనే, ఈ సంవత్సరం కూడా చక్కా శ్రీమన్నారాయణగారు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం కాలేజి విద్యార్థులలో ఒక Male Studentఒక Girl studentకు వస్త్రములు బహుమానంగా యిచ్చినారు. వారి తల్లిదండ్రుల పేరు మీద ఏర్పాటు చేసిన ట్రస్ట్ ద్వారా నలుగురు కాలేజి పేద విద్యార్థులకు ఫీజు కట్టారు. విజయవాడ వాస్తవ్యులు శ్రీ నంబూరి చిరంజీవిగారు పాఠశాల విద్యార్థులలో ఒక బాలునకు ఒక బాలికకు (మంచి మార్కులు పొందినటు వంటి వారి వాచీలు బహుకరించారు. యిద్దరు హైస్కూల్ పిల్లలకు ఫీజు కట్టారు.

“అన్నపూర్ణాలయం” స్థాపించిన రోజు సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీ చక్కా శ్రీమన్నారాయణ గారు వారు నిర్మించే “శ్రీవిద్యానిలయము’ భవన సముదాయం తరుపున రూ. 25,000/- చెక్కును శ్రీ విశ్వజననీపరిషత్ కు సమర్పించారు.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!