6-8-2024 మంగళవారంనాడు మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల 54వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు జిల్లెళ్ళమూడిలో వైభవంగా జరిగాయి. కళాశాల జాతీయస్థాయి గుర్తింపు పొందిన సందర్భంగా ఈ సభ మరింత విశిష్టతను సంతరించుకుంది. ఉభయ ట్రస్టులు అధ్యక్షులు శ్రీ VSR మూర్తి గారు తమ అధ్యక్షోపన్యాసంలో జాతీయ స్థాయి గుర్తింపు పొందిన ఈ కళాశాల మరో ముందడుగు వేసి విశ్వజనీనం కావాలని మంగళాశాసనం చేశారు. అనంతరం మాతృశ్రీ ప్రాచ్య పాఠశాల కళాశాలల పూర్వ విద్యార్థిసమితి వారు కళాశాల పూర్వ కరస్పాండెంట్ శ్రీ. M.S. శరచ్చంద్ర కుమార్ గారిని విశిష్ట అతిథిగా సత్కరించారు.
Management Committee Convener శ్రీమతి సుబ్బలక్ష్మి గారు, పెద్దలు శ్రీ బొప్పూడి రామ బ్రహ్మంగారు ఈ సభలో పాల్గొన్నారు. ఉభయ ట్రస్టుల Managing Trustee శ్రీ పి. గిరిధర కుమార్ గారు అవిశ్రాంతంగా పనిచేసిన కళాశాల అధ్యాపక బృందాన్ని అభినందించి రజత పతకాలతో సత్కరించారు. పూర్వ విద్యార్థి సమితి తరఫున శ్రీ గోగినేని రాఘవేంద్రరావు గారు, శ్రీ రామకృష్ణ గారు అధ్యాపకులందరినీ నూతన వస్త్రాలతో సమ్మానించారు. Principal డాక్టర్ అన్నదానం హనుమత్ప్రసాద్ కళాశాల 2023 – 24 వార్షిక నివేదికను అందించారు. శరచ్చంద్ర గారి ఆధ్వర్యంలో Basics in Karnatak Music అనే సర్టిఫికెట్ కోర్సుపూర్తిచేసిన విద్యార్థులు గీతాలాపన చేశారు. ప్రమాణ పత్రాలను అందుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు జరిపిన సాహితీ పరమైన పోటీలలో ప్రథమ ద్వితీయ స్థానాలను పొందిన వారికి పూర్వ విద్యార్థి సమితి పుస్తకాలను బహూకరించింది. కార్యక్రమంలో ప్రదర్శించిన కోలాటం అందరినీ అలరించింది. కళాశాల సంస్కృతశాఖాధ్యక్షులు శ్రీ R. వరప్రసాద్ సభానిర్వహణ చేశారు. తెలుగు శాఖాధిపతి
డా. L. మృదుల వందన సమర్పణ చేశారు. శాంతి మంత్రంతో కార్యక్రమం ముగిసింది.