1. Home
  2. Articles
  3. Viswajanani
  4. కళాశాల వార్తలు

కళాశాల వార్తలు

Editorial Board - Viswajanani
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 22
Month : August
Issue Number : 1
Year : 2022

మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రిన్సిపాల్ (ఇన్ ఛార్జ్) పదవికి సంస్కృత అధ్యాపకులు డా. అన్నదానం హనుమత్ ప్రసాద్ గారిని నియమిస్తూ కళాశాల పాలకవర్గం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నియామకం 2023 జూన్ 5వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది.

కళాశాల కరస్పాండెంటుగా మన కళాశాల పూర్వ విద్యార్థి (1980-1985), పూర్వ విద్యార్ధి సమితి అధ్యక్షులు శ్రీ గోగినేని రాఘవేంద్ర రావుగారిని పాలక వర్గం ఎంపిక చేసింది. శ్రీ రాఘవేంద్రరావుగారు 2023 జూన్ 26వ తేదీన ఈ బాధ్యతను స్వీకరించారు.

అమ్మ దివ్యానుగ్రహంతో డా. హనుమత్ ప్రసాద్ గారి సారథ్యంలో, శ్రీ రాఘవేంద్రరావుగారి నాయకత్వంలో కళాశాల అభ్యుదయపథంలో పురోగమించ గలదని ఆకాంక్షిస్తూ..

హనుమత్ ప్రసాద్ గారికీ శ్రీ రాఘవేంద్ర రావుగారికీ అభినందన పూర్వక శుభాకాంక్షలు అందిస్తున్నాము. – శ్రీ విశ్వజననీ పరిషత్ ట్రస్ట్, జిల్లెళ్ళమూడి.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!