అరయ నందరి కాదర్శమైన గాని
ఇట్టి మార్గంబునందిరే? యితరులెవరు.
జయహెూ! మాతయటన్న నాదమే సుధా సంకాశమై జిహ్వపై
నియతంబై నటియింప తజ్జనని పన్నీరేజముల్ గొల్చుటే
ప్రియమై జిల్లెలమూడి యమ్మ తనకీ విశ్వాకృతిన్ దోపదా
నియమస్ఫూర్తి భజించి ధన్యతను పొండెన్ ఆంజనేయప్రసాద్.1
సాహితీరూపకమ్ములలో ప్రచండరీతి
కెరల విప్లవకవి, రామకృష్ణకవిగ
ప్రేక్షకాభిమానము పెల్లువిలుచుకొంటి
నీకు ఆంజనేయ సుకవి!
అతిలోకోత్తర సాహితీధనుడు మిత్రాత్మీయతా బాంధవ
స్థితి సర్వోన్నతచిత్తభావనుడు వ్రాసెన్ చెక్కుకావ్యంబు ల
ద్భుత తృప్తిన్ బఠియించి సత్కవులు సంతోషించి జైవెట్టగా
ధృతి వాగ్దేవికి పుంస్త్వరూపమనగా ధీమత్ప్రభారాశియై.
ఆంజనేయప్రసా దతిలోకపాండితీ
మండనుండు విభవాఖండలుండు
కులమతభేదంబు గలుగక అతిథుల
కాతిథ్య మిడు నింట అనవరతము
వ్రతశీల యనుకూలవతి భార్యయై సదా
అభ్యాగతుల ప్రీతి నాదరింప
గార్తస్య మీరీతి గడుపంగవలెనన్న
పద్ధతి చాటించె ప్రబలరీతి
అవసరమునకు తనయింటి యరుగు జేరు
నతిథులా యింట తినకుండ ననుగువారె?
ధనమన నాశలేదు దురితంపు తలంపులు లేవు మిత్రులన్
దనవలె గౌరవించి వినుతంబగు సాయముచేయుటొక్కటే
ఘనముగ నాచరించె నవకావ్యకళా కమనీయసేవలన్
ప్రణుతి గడించి, అమ్మపదపద్మములన్ భజియింప నేగితే!
కులపతిగారిసోదరు, డకుంఠితపాండితిదక్షు డంచు ని
శ్చలగతి లోకమెల్లను ప్రశంసలదేల్పగ నొప్పి – సంతతిన్
వలనుగ తీర్చిదిద్ది యతివైభవసిద్ధి గడింపజేసి ని
ర్మలగతి సాగి యీ విహపరంబుల ధన్యుడవైతి వెన్నగన్.
జిల్లెలమూడియమ్మ పదసేవకు కాలము దగ్గరయ్యే నం
చల్లననేగినావు విచట సాయము పొందినవారు భక్తిసం
దిల్లతలంతురెల్లపుడు నిన్నెకవీంద్ర! భవచ్చరిత్రకున్
మొల్లవుకీర్తి తెచ్చెద రమోఘతనీదుకుమారు లున్నతిని.