14 ఆగస్టు 2024, బుధవారం, ఉదయం 10. గంటల నుండి కాకుమాను శ్రీ కోదండరామాలయంలో శ్రీ విశ్వజననీ పరిషత్ వారి ఆధ్వర్యంలో 108 మందిచే సామూహిక లలితా సహస్రనామ పారాయణ పూర్వకంగా అనసూయా వ్రతాలు నిర్వహించబడ్డాయి.
ఈ కార్యక్రమంలో శ్రీ దినకర్ అన్నయ్య, శ్రీ చక్కా శ్రీమన్నారాయణ దంపతులు-వారి వియ్యంకులు, శ్రీ యం.వి.ఆర్. సాయిబాబు, శ్రీకాంత్ ప్రభృతులు పాల్గొన్నారు. ఆనంతరం అన్నపూర్ణాలయం నుండి పంపిన అన్నప్రసాదం వితరణ చేశారు.