ఏ బిడ్డ దుఃఖ పడినా
నేనున్న కదరా నాన్న
ఎందుకేడుస్తావ్ ఊర్కో
అని కన్నీళ్లు తుడిచి కడుపునింపే కారుణ్యమూర్తి
నా అమ్మ
అందరమ్మల్లా కనిపించే
అందరమ్మ
నా అమ్మ
కోపమే తెలియని సహజసహనం
నా అమ్మ
మనిషి లోని మనసు అమ్మ
రాతిలోని నీరు అమ్మ ప్రాణుల్లో జీవం అమ్మ
అచలనం లోని శక్తి
అమ్మ లేని అణువు లేదు
నేల నీరు నిప్పు నిజం
నా అమ్మ
అన్నీ అమ్మే అంతా అమ్మే
విశ్వానికి కారణం అమ్మ