- విబ్రవరి, 1958 మామపౌర్ణమి నాడు అమ్ము కాలాన్ని స్తంభింపజేసిందా? నందేహమే లేదు. ఆనాడు 600 ముందికి అమ్మ మంత్రోపదేశం చేసింది. ఒక్కొక్కరికి ఒక నిముషం చొప్పున 600 నిముషాలు అంటే 10 గంటలు కావాలి. కనుక తెల్లవారుజామున 2-45 కు బయలుదేరి ఓంకారపది దగ్గర మంత్రోపదేశం ముగించుకొని 7.30 కు ఇంటికి చేరింది అమ్మ. మంత్రోపదేశం పూర్తిచేసిన సమయంలో ఇంకా వెన్నెల ఉన్నది. అంటే దాదాపు 3 గంటల వ్యవధిలోనే 10 గంటల కాలాన్ని ఇమిడ్చింది. కాలస్వరూపిణి అమ్మ పాదాలచంత కాలం మోకరిల్లింది. కాలాతీతమహాశక్తి అమ్మ, మాఘపౌర్ణమి జిల్లెళ్ళమూడి చరిత్రలోనే ఘనమైన రోజు. ఆ రోజున అమ్మ చేత మంత్రోపదేశ భాగ్యాన్ని పొందిన సోదరసోదరులందరూ ధన్యులు,
అమ్మ ఇంకా చాలామందికి ఉపనయనం సందర్భంగా, ఇతర పవిత్రమైన రోజుల్లో విడిగా కూడా మంత్రోపదేశం చేసింది. అమ్మ గాయత్రీ దేవి. అమ్మ నామ మంత్రం గాయత్రీ మంత్రం. ఇప్పటికి 67 సంవత్సరాల కాలం గడిచినా ఆనాటి సంఘటన చూచినవాళ్ళకి, ఆ అనుభూరి సాదిన వాళ్ళకి శరీరం రోమాంచిత మవుతుంది. ఈ సంవత్సరం మాఘపౌర్ణమి 12 ఫిబ్రవరి నాడు వచ్చింది. 12వ తేదీ అమ్మ ఆలయ ప్రవేశం చేసిన రోజుకూడా, తేదీ, లారీఖు రెంయా అమ్మ జీవితమహోదధిలో ప్రత్యేకమైనమే!
మాఘపూర్ణిమ నాడు ఓంకారనది ఒడ్డున అమ్మ మంత్రోపదేశం చేసిన పవిత్రమైన స్థలంలో మంత్ర సనశ్చరణ చేయాలని సోదరులు సంకల్పించారు.
శ్రీమతి బ్రహ్మాందం పసుందర అశ్చయ్యను తీసుకొని వెళ్ళి ఆ స్థలాన్ని గుర్తించి అక్కడ మాఘసౌర్ణము కార్యక్రమం చేద్దామని వెళ్ళాము. ఆ ప్రదేశం అంతా తుప్పలతో, ముళ్ళ పొదలతో అరణ్యాన్ని తలపింపజేసింది. మనం సంకల్పించిన కార్యక్రమం చెయ్యగలమా? అని సందేహం కలిగింది.
ఆ ప్రదేశం అంతా ఓంకారనది ఒడ్డుకు చదును చేయించి 12 వ తేదీ ఉదయం అమ్మ చిత్ర పటంతో ఓంకారవరి ఒడ్డున షామియానాలో సోదరీ సోదరులు, వేదపాఠశాల విద్యార్ధులు, ఉపాధ్యాయుడు, భజన బృందం-అందరం ప్రశాంతమైన పవిత్ర ప్రదేశంలో అమ్మ నామ సంకీర్తన చేశాము, సోదరుడు ధర్శనూరి అంబికా అష్టోత్తర శతనామావళి వరించగా వేదపండితులు పూజ నిర్వహించారు. తదుపరి అందరూ గాయత్రీ మంత్ర పునశ్చరణ, అమ్మ మంత్ర వనశ్చరణ చేశాము. సోదరుడు శ్రీ వారణాని దర్శమారి ప్రసంగిస్తూ అలవాడు అమ్మ ఎలా కాలాన్ని స్తంభించదేనీ మంత్రోపదేశం చేసిందో వివరించారు. శ్రీ లాలా అన్నయ్య గాయత్రీ మంత్రం జవస్తుందగా తపకు అమ్మ దర్శనం అయిందనీ, కాశీ, ప్రయాగ, త్రివేణీ సంగమం లాంటి పుష్కర ఘాట్ ఏర్పడి ఎంతో మంది వేదవండితులు, భక్తులు వస్తున్నట్లుగా అనుభూతి కలిగిందని చెప్పారు. ఈ మాటి కోసం తనవంతు విరాళం పూజాపుష్పంగా సమర్పిస్తానని చెప్పారు. శ్రీమతి శేషుమణి గారు, శింగరాజు సీతాలక్ష్మి గారు కూడా ఈ షూట్ కోసం తమవంతు విరాళం సమర్పణం చేస్తామన్నారు. ఓంకారనదిలో అందరూ పూలు, కుంకుమ, పసుపు చల్లి పచిత్ర జలాలతో ప్రోక్షణ చేసుకున్నాము. శ్రీ లక్కరాజు సత్యనారాయణ (లాలా అన్నయ్య), శ్రీ దినకర్ అన్నయ్య గారు కూడా కార్యక్రమంలో ప్రసంగించారు. తదుపు అందరూ అమ్మప్రసాదం స్వీకరించారు.
ప్రశాంతమైన పరావరణం, ఆధ్యాన్నిక సుమకాలతో ఫలకాంకితమైనట్లుగా, అమ్మపవిత్ర సాన్నిధ్యం అనుభూతమైనట్లు అందరూ ఆనందించారు..
ఈ కార్యక్రమం ద్వారా ఒక అడుగు ముందుకేస్తే నది అడుగులు అమ్మ పరిహర్ణమైన ఆశీస్సులతో ముందుకు నడిపిస్తుందని నాకు మహత్తర మైన అనుభూతి కలిగింది. ఇది అమ్మ అదృశ్యంగా ఉండే అడుగడుగునా వర్షించే అనుగ్రహవిశేషం.