జిల్లెలమూడిలో నగల చక్కని సాంత్వన పొందవెక్కడున్
మల్లెలు పూచినట్లు మరు మల్లెలు చల్లగ వీచునట్లు మీ
చల్లని చూపుతోడ మము చేరగ తీసిన మాతృ భావనన్
ఉల్లము తాకినట్లు మనమొందిన హాయిని గూర్చు నమ్మయే,
ఎంతటి మేటి మానిసిగ యెయ్యెడ నెంతటి పేరుగాంచినన్
అంతట గెల్పునన్ గైకొని ఎంతటి మెప్పును పొందియుండగన్
పొంతన లేదెక్కడ? నిను బోలిన పండిత మాన్యులెచ్చటన్
కాంతకు లొంగు చుండు నిల కొందఱు బోధకు లేమి చిత్రమో ?
వచ్చుచు నుందురర్కపురి వాన సేయగ నమ్మ సన్నిధిన్
ఇచ్చుచు నుండు కొందఱును ఇమ్ముగ సొమ్ములు నన్న పానమంలీ
మచ్చయు లేని యట్టి యిల మంచిని మించిన భక్తి భావనల్
వచ్చిన వార వెల్లరున్ ను వేడుక పొందును అమ్మసన్నిధిన్
మాట వల్లనే కలుగు మాన్యత సంపద వెల్లవేళలన్
మాటల వల్లనే కలుగు మోదము భేదము వచ్చు నమ్మరో
మాటల వల్లనే కలుగు మానుష జాతికి దైవ శక్తులన్
మాటల తల్లినీవె యని మిమ్మును వేడితి కావుమమ్మరో
అనయము వచ్చు చుంద్రు నిను అర్చన సేయరమూల్య రాశులన్
వినయము నేర్చు కొందు రిట వెల్గును జూచియె వారి చిత్రమున్
వినుటయె మాటగాని మరివేయగవేరు మరొక్క ప్రశ్నయున్ (నిన్)
గనుటయె మాకు ముక్తి కావుము మమ్ముల కల్పవల్లిలో ?