సోమవారం ఫిబ్రవరి 25వ తారీఖు
సుమారు రాత్రి 10గంటలకు మా అమ్మాయి హైమ
బెంగుళూర్ నుండి ఫోన్లో గద్గద కంఠంతో
విలవిల లాడుచూ వినిపించింది విషాద వార్త
మా మామయ్య గారు ఇకలేరు అని
నేను, నా భార్య మణి ఉభయులం దిగ్భ్రాంతి చెందాం.
అంతకు అయిదు రోజులు ముందు శ్రీరామారావుగారిని
చూడటానికి వెళ్ళిన సందర్భంలో
ఆయనని పలకరించి, హాలులోకి వెళుతుంటే
చేయిచాచి చేయి కలిపి (Shake Hand)
చిరునవ్వుతో తనివి తీరా ఆదరించారు.
అది ఆయ ఆప్యాయత అంటే
అంతలోనే ఇంతటి పిడుగులాంటి వార్త
విన్న మాకు విషాదం తప్ప ఏముటుంది?
మనం అనుకుంటూ ఉంటాం సూర్యుడు అస్తమించాడని
అదే సూర్యాస్తమయిందని
దేదీప్యమానమైన తేజోమయునికి, అస్తమయమేమిటి?
ఇక్కడ భారతావనిలో అస్తమిస్తే
అక్కడ అమెరికాలో ఉదయిస్తున్నాడుగా!
అక్కడ సూర్యుడు, ఇక్కడ సూర్యుడు వేరు కాదుగా?
దేదీప్యమానమైన ప్రత్యక్షదైవం
సూర్యదేవునికి అస్తమయం లేదుగా!
(అలాగే) మన పూజ్యనీయులు శ్రీరామారావుగారు
ఇక్కడ తనువు చాలించారు.
అక్కడ స్వర్గంలో ఉదయించారు.
అందుకేనేమో అంటారు.
స్వర్గస్తులైనారని.