అమ్మ దృష్టిలో ‘ఆదరణాలయం’ అంటే ఏమిటో కేశవన్నయ్య చాల స్పష్టంగా అది ఏలా ఉండాలో, ఎవరు ఉండాలో, ఏలా నిర్వహించాలో తన పిల్లల చేత దాని నిర్మాణాన్ని చేయించటానికి కృషి చేశాడు. కేశవన్నయ్య ఆలోచనలకు అనుగుణంగా, అవసరమనుకుంటే శారదక్కయ్యను, వారి పిల్లలను సంప్రదించి నిర్వహించ వచ్చు. సంస్థకు చేతనయిన పరిధిలో కొద్ది మందికే సేవచేయవచ్చు. అంతేగాని డబ్బులు తీసుకొని నిర్వహించే వృద్ధాశ్రమాలవలే, బంధువులను ఆదరించే ఆదరణాలయం ఉండరాదని, అలా చేస్తే అమ్మ ఆశయాలకు, కేశవన్నయ్య కృషికి విరుద్ధమైన భావనేనని చాలామంది ఆలోచన. నేను సంస్థ నిర్వహణ బాధ్యతలో ఉండి కూడా ఈలా వ్రాయవలసి రావటంలోని నా ఆవేదనను అర్థం చేసుకోగలరని ప్రార్థిస్తున్నాను.
కేశవన్నయ్య భావించిన ఆదరణాలయం
J Yanadi
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 11
Month : April
Issue Number : 9
Year : 2012
Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.