1. Home
  2. Articles
  3. Viswajanani
  4. కేశవశర్మకు శ్రద్ధాంజలి

కేశవశర్మకు శ్రద్ధాంజలి

Potharaju Hymanand
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 9
Month : July
Issue Number : 12
Year : 2010

అమ్మసేవ ఊపిరిగా అలసిపోయి సొలసిపోయి 

వడదెబ్బకు వడిలిపోయి జీవిత మర్పించినట్టి

కేశవునకు వందనం – మైత్రికి హరిచందనం.

 ఉచ్ఛ్వాసము నిశ్వాసము అమ్మ నామ చింతనయే

 అమ్మకార్య నిర్వహణలొ తనువు మనము ధనము నిచ్చు

కేశవునకు ప్రేమాంజలి మా మైత్రికి పుష్పాంజలి

 ఆత్మీయత అనురాగము నిష్కల్మష హృదయమ్ము

 స్వచ్ఛమైన చిరునవ్వులు చిందించే స్పందించే

 కేశవునకు నమస్సులు మామైత్రికి సుమస్సులు

అనసూయా మాతృమూర్తి ముద్దుపెట్టి ముద్దుపెట్టి 

కళ్యాణానందుని చేసిన సుగతిని నుదుటన వ్రాసిన 

కేశవునకు వాగభిషేకము – చిరునవ్వుల సుమాభిషేకము

 అంతరంగ తరంగాలు అతలాకుతలము చేసిన 

అందరింటి ప్రేమమూర్తి నచ్చినట్టి మెచ్చినట్టి

కేశవునకు అభినందన మధురహృదయ సంస్పందన 

గతకాలపు మధురస్మృతులు కనులముందు కదులుచుండ

ఆతడు లేడను మాటే యెదను కలచివేయుచుండ

 కేశవునకు శ్రద్ధాంజలి కేశవునకు బద్ధ కరాంజలి..

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!