కొవ్వూరు పట్టణంలో ఆగస్టు 15వ తేదీ ఉదయం 10గం కు మాతృశ్రీ జల ప్రసార కేంద్రాన్ని మహామహోపాధ్యాయ ఆచార్య దోర్బల ప్రభాకర శర్మగారు ప్రారంభం చేశారు. శివరామ గాన్: ఏజెన్సీస్ అధ్వర్యవంలో గుడివాక శ్రీనివాస్ గారు ఈ కేంద్రం నెలకొల్పారు. శివరామ గాస్ ఏజెన్సీ ఆవరణలోనే అమ్మకు అంకిత భక్తులైన తమ తండ్రి శ్రీ గుడివాక నమశ్శివాయ గారి స్మృతిచిహ్నంగా ఈ కేంద్రాన్ని వెలకొల్పినట్లు వ్యవస్థాపకులు శ్రీ శ్రీనివాస్ గారు తెలియచేశారు.
అమ్మ శతజయంతి సంవత్సర సందర్భంగా గడచిన వేసవిలో నాలుగు నెలలపాటు ఈ ప్రదేశంలోనే చల్లని మజ్జిగ, మంచినీరు బాటసారులకు అందించే చలివేంద్రం కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీనివాస్ ” గారు మంచినీటి వితరణ సేవలకు తగిన విధంగా శాశ్వత ప్రాతిపదికన ఈ జల ప్రసాద కేంద్రం నెలకొల్పటం ముదావహమనీ తల్లిదండ్రులను స్మరిస్తూ, మాతృశ్రీ అనసూయాదేవి పేరిట ఈ సత్కార్యానికి పూనుకొన్న శ్రీనివాస్ దంపతులను, వారి కుటుంబ సభ్యులనూ ఆచార్య ప్రభాకరశర్మగారు అభినందించారు. ఎవరికి దప్పిక కలిగినా ఎవరినీ అడుగ నక్కర లేకుండానే అమ్మ ప్రసాదంగా స్వచ్ఛమైన చల్లని మంచినీటిని కొవ్వూరు ప్రజలందరూ అందుకోవచ్చుననీ, ఎవరైనా స్వతంత్రంగా ఈ కేంద్రాన్ని వినియోగించుకోవచ్చునని కార్యకర్తలు ప్రకటించారు.
విశ్వప్రేమకూ సేవాతత్పరతకూ వాత్సల్యానికీ ప్రతిరూపమైన అమ్మ ఆశీస్సులతో ఈ సత్యార్యానికి సంకల్పం కలిగిందని శ్రీ శ్రీనివాస్ గారు వెల్లడించారు. అమ్మనుంచి స్ఫూర్తిని పొంది సత్కార్య నిర్వహణకు దీక్ష పట్టిన శ్రీనివాస్ గారిని శ్రీ విశ్వ జననీ పరిషత్ ట్రస్టు అభినందిస్తోంది.
వీరి సేవా తత్పరత మరింత మందికి ప్రేరణ కావాలని అమ్మ ఆశీస్సులు శ్రీనివాస్ గారి కుటుంబం పై పుష్కలంగా వర్షించాలనీ ‘విశ్వజనని’ సంపాదక మండలి ఆకాంక్షిస్తోంది.
– అద్యపురి విలేఖరి