వైజాగ్ మందిరంలో ఈ మధ్య చాలా మార్పులు జరిగాయి. నా అనారోగ్యం వల్ల ఉదయం అమ్మపూజా కార్యక్రమానికి వెళ్ళటం కష్టమైపోయింది. దానికి తోడు మందిరం దూరమయింది కదా! గత ఏడాది నుంచి మా వంట అమ్మాయి లక్ష్మి రోజు ప్రొద్దున్నే వెళ్ళి దీపారాధన, పూజ నిర్వహించేది. ఆమె వూరికి దూరంగా వున్న మధురవాడనుంచి వచ్చేది. ప్రయాణమే 1 గంట పడ్తుంది. ప్రతినెల ఆమె నెలసరి 4 రోజులలో నేనే వెళ్ళేవాడిని. అమ్మ మందిరంలో వున్న అశోక్హౌస్ వున్నప్పుడు అనేక ఫోటోలను చేయించుకున్నాను. రెండు పెద్ద ఫోటోలు వుండేవి. మేము అశోక్ హౌస్ ఖాళీ చేసే ముందు ఒక పెయింటింగ్ బాగా రంగులు పోయి ముడతలు వచ్చాయి. రిపేర్ చేయించటానికి మందిరంలో పెట్టాను. మా బిల్డింగ్లోనే ఏకా రాజేశ్వరరావుగారి రెండో అబ్బాయి ఏకారంగారావు వుండేవాడు. అందులోనే కరస్పాండెన్స్ కోర్సులో అసిస్టెంట్ డైరెక్టరుగా పనిచేసిన డాక్టర్ రవిబాబుగారుండేవారు. మందిరంకు దగ్గరగా వుండాలన్న ఉద్దేశ్యంతోనే వారు అక్కడకు వచ్చారు. అది ఖాళీ చేయించటంతో వాళ్ళకు దగ్గరలోనే అద్దెకు దొరికాయి. మా నివాసం మాత్రం కొంతదూరమైంది.
అమ్మ పెయింటింగ్ ఏకారంగారావుగారు. లామినేట్ చేయించి ఇంట్లో చక్కగా అమర్చుకున్నారు. దాని వద్దే కూర్చుని ఆరాధించుకునేవారు. రంగారావు ఆరోగ్యం ఎంచుకుంది. సరిగా లేక బాధపడ్తుండేవారు. కడుపులో మంట ఓర్చుకోలేక బాధపడలేకుండా వున్నానమ్మా” అని రోదిస్తుంటే దాదాపు 2సంవత్సరాల క్రితం అమ్మ ఆయన్ని అనుగ్రహించి తనలో ఐక్యం చేసుకుంది. వారికి ఒక్కడే కొడుకు రాజేష్, యోగ్యుడు. జాగ్రత్తగా చదువుకుంటూ బి.కాం. పూర్తిచేసాడు. భార్య కరుణ. రంగారావుగారి వాళ్ళ నాన్నగారు ఏకా రాజేశ్వరరావుకు సంగీతంలో ప్రావీణ్యం వుంది.
రాజేష్ కూడా గిటారు, కీబోర్డు వాయించేవాడు. కచేరీలు కూడా చేసాడు. అమ్మ అనుగ్రహించింది. అతను దాదాపు రెండు నెలలుగా ఉదయమే మందిరంకు వెళ్ళి అమ్మను అర్చించుకుంటున్నాడు. మావంట అమ్మాయి లక్ష్మివాళ్ళ బావగారు మరణించడంతో తనకు రావటానికి వీలవనందున మందిరం దగ్గరగా వుండటంతో రాజేష్ శాస్త్రోక్తంగా అమ్మకు పూజ చేసుకుంటున్నాడు. నాకు ఎంతో భారం దిగిపోయింది. అందరం పెద్దవాళ్ళం అవుతున్నాము. ఓపికలు తగ్గుతున్నాయి. తరువాతి తరం వాళ్ళు రావాలని కేశవ అన్నయ్య పరితపించేపోయేవాడు. అమ్మ కేశవన్నయ్య కోరిక మా కోరికను మన్నించింది. రాజేష్ను అనుగ్రహించింది.
అంజన్ కూతురు పెళ్ళికి వెళ్ళినప్పుడు మర్నాడు కుసుమ జిల్లెళ్ళమూడి వెళ్తూ ఏకా రాజేశ్వరరావుగారి మనవలను చరణ్, రాజేష్ ను జిల్లెళ్ళమూడికి తీసుకువెళ్ళింది. అక్కడ దేవాలయాలను దర్శించుకున్నాడు. పులకరించిపోయాడు. అమ్మను ఇంకా ఇంకా ఆరాధించు కోవాలన్న తపన పెరిగిపోయింది. “రోజూ నేనే ఉదయం చేసుకుంటానని వాళ్ళ అమ్మ కరుణతో కబురుచేసాడు. మాకు ఓపిక తగ్గిపోతున్న తరుణంలో అమ్మ రాజేషన్ను
సాయంత్రం ఇంట్లో సంగీతం క్లాసులు చెప్పకుంటూ ఇటు అమ్మపూజ చేయటం మామూలు విషయం కాదు. కదా! వాళ్ళ అమ్మా మేము సాయంత్రం మందిరంలో ఎంతో తృప్తిగా, ఆనందంగా కొలుచుకుంటున్నాము. ఈ రకంగా అమ్మ క్షణక్షణం మమ్మల్ని కాపాడుతూనే వున్నది.