1. Home
  2. Articles
  3. Viswajanani
  4. క్షణక్షణం – అనుక్షణం

క్షణక్షణం – అనుక్షణం

A. S. Chakravarthy
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 1
Month : January
Issue Number : 1
Year : 1960

అమ్మ మన వెనకాలే వుండి క్షణక్షణం మనలను కాపాడుతున్న సంగతి బిడ్డలందరికీ విదితమే కదా ! అతి సున్నితమైన, ఆప్యాయతతో కూడిన హైమను తన సర్వశక్తులను ధారిపోసి మనందరి కోసం మాధవిగా మలచింది. లలితాస్వరూపిణియైన మన హైమక్క ప్రతి పుట్టినరోజూ కోటి నామపారాయణ చేయించి తద్వారా మనందరి చేత కోట్ల పారాయణలు చేయిస్తూ మనందరమూ పునీతులు కావటానికి దోహదం చేసింది అమ్మ. మన కోరికలు తీరాలంటే హైమక్కను కొలిస్తే కొంగుబంగారమే. 

హైమక్క జన్మదినం నవంబరు 18న విశాఖ మందిరంలో హైమక్క వ్రతం చేయటం పరిపాటి. ఆరోజు పూజకు వచ్చిన దాట్ల సత్యనారాయణరాజు గారి భార్య లక్ష్మిగారు “మా అబ్బాయి 4 సంవత్సరాలుగా మర్చెంట్ నావీలో ఉద్యోగం చేస్తున్నాడు. లక్షణమైన సంబంధం ఒక్కటీ కుదరటం లేదని హైమక్కకు మొరపెట్టుకున్నారు. ఇన్ని రోజులుగా రానిది 2 రోజుల్లో పర్లా కిమిడీ నుంచి వాళ్ళకు అనువైన సంబంధం వచ్చి ఏప్రియల్ 24 తేది వివాహం నిశ్చయమైందని హైమక్క అనుగ్రహమని మురిసిపోతూ చెప్పారు.

శ్రీ మోటమర్రి కామేశ్వరరావుగారు వ్యాపారస్థులు. విశాఖ అధ్యయనపరిషత్ మొదటి అధ్యక్షులైన శ్రీ ఎ.వి.వి. ప్రసాదరావుగారి శిష్యులు. ప్రసాదరావుగారు అమ్మను తలుచుకొని, అమ్మ చెప్పిందని వారిని అనేక సమస్యలనుంచీ బయటపడవేశారు. వారు అప్పటి నుంచీ అమ్మను కొలుస్తున్నవారే. విశాఖమందిరంకు తరుచూ వస్తూ అని ఫంక్షన్స్లో పాల్గొంటున్నారు. ఆయనకు ముగ్గురు కుమారులు. మూడవ అబ్బాయికి వివాహం అయ్యి 6 సంవత్సరాలు అయినా సంతానం లేదని బాధపడ్డారు. వాళ్ళు జిల్లెళ్ళమూడి వెళ్లామనుకుంటున్నారని చెప్పారు. దానికి నా భార్య కుసుమ జిల్లెళ్ళమూడిలో హైమాలయంలో మీ మూడో కోడలిని పూజ చేసుకొని ప్రదక్షిణలు చేసి కోరికను హైమక్కకు నివేదించుకోండి అని చెప్పింది.

వాళ్ళ తీర్థయాత్రలకు వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు జిల్లెళ్ళమూడి వెళ్ళి కుసుమచెప్పినట్లుగా వాళ్ళు ప్రదక్షిణలు పూజ చేసుకున్నారట. అక్కడ నుంచీ వచ్చిన తరువాత నెలతప్పటమూ పండంటి వారసుడ్ని హైమక్క ప్రసాదించటం జరిగింది. ఆ పిల్లవాడిని మందిరానికి తీసుకు వచ్చి ‘అమ్మ హైమల కరుణకు అవధులు లేవు. మన కోర్కెలు తీర్చే కల్పవల్లి హైమక్క’ అని పరవశంతో చెప్పారు.

కుసుమరాసిన అమ్మ సచ్చరిత్ర మూడుభాగాలు, దివ్యానుభూతులు, ఆధ్యాత్మిక మధురస్మృతులను సత్యం ఆఫ్సెట్ ప్రింటర్స్లో వేయించింది. అందులో కిరణ్మయి అని ఒక అమ్మాయి పనిచేసేది. ఆ అమ్మాయి పర్యవేక్షణలోనే ఆ పుస్తకాలు వెలుగులోకి వచ్చాయి. ఆ తరువాత ఆమె సొంతంగా తాను మొదలు పెట్టింది. నేను ప్రతి సంవత్సరం కన్యాకుమారి వెళ్ళినప్పుడు “అక్కడ కన్యాకుమారి మన హైమలా వుంటుంది కదరా” అని అమ్మ గోపాలన్నయ్యతో అన్నమాటలే గుర్తుకు వచ్చి హైమక్కగానే భావించుకొని అర్చించుకుంటాను. చాలా మంది హైమక్క ఫోటోలు కావాలని అడుగుతున్నారు. కన్యాకుమారి ఫోటోకే మన హైమక్క ముఖము పెట్టి చేయిస్తే బాగుంటుందన్న ఆలోచన వచ్చింది.

2013 హైమక్క పుట్టినరోజుకు ముందుగా ఆ ఫోటోలు చేయించి ఇస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో కుసుమ ఆ ప్రింటింగ్ ప్రెస్కు వెళ్ళటం జరిగింది. మాటల సందర్భంలో నీకు పిల్లలా అని అడిగిందిట. 10 సంవత్సరాలు అయింది. ఇంకా పిల్లలు లేరని దిగులుగా చెప్పిందిట. దానికి కుసుమ హైమక్క ఫోటోలు చేయిస్తున్నావు కదా ! హైమక్క చూసుకుంటుంది. తొందర్లోనే సంతానవతివి అవుతావని దీవించిందిట. ఆ తరువాతే నెల తప్పటం 5 నెలలు నిండాయి మేడమ్ గారి దీవెన ఫలించిందని కిరణ్మయి నాకు ఫోను చేసి చెప్పటంతో ఆశ్చర్యపోవటం నా వంతు అయింది.

మా మందిరంలో కరెంట్ పోయినా, వర్షం వచ్చినా, హైమక్క నామం చేయటం వెంటనే కరెంటు రావటం, వానతగ్గటమే ఆశ్చర్యమనిపిస్తే ఈ పై సంఘటనలకు హైమక్క కరుణ, అనుగ్రహం గురించి వేరే చెప్పేది. ఏముంది. అందరమూ భక్తిశ్రద్ధలతో హైమక్క నామం చేద్దాము. ఓం హైమ ! నమో హైమ ! శ్రీ హైమ ! జై హైమ!”

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!