జయ మాతా! శ్రీ అనసూయా !
రాజరాజేశ్వరి ! శ్రీపరాత్పరి !
జయహెూమాతా ! శ్రీ అనసూయా ! – (2)
రాజరాజేశ్వరి ! శ్రీపరాత్పరి ! — జయజయ హె మాతా !
అమ్మవు నీవే బ్రహ్మవు నీవే
బ్రహ్మము నీవేలే! పరబ్రహ్మము నీవేలే !
అందరిలోగల ఆత్మవునీవే – ॥ అందరి ॥
ఆది పరాశక్తీ !
— ఓం జయజయహెూమాతా !
లోపల నీవే వెలుపల నీవే
అంతట నీవేలే ! జగమంతట నీవేలే !
అండపిండ బ్రహ్మాండము నిండిన అశ నీవే
— ఓం జయజయహెూమాతా !
గురువువు నీవే గుర్తువు నీవే
గమ్యము నీవేలే ! మా గమనము నీవేలే !
మనసు మంత్రమను మనన తంత్రమను
మాటయు నీదేలే
॥మనసు॥
— ఓం జయజయహెూమాతా !
అనగా అంతము ఆదీ
లేని దనంలే ! అంతయు అదియేనంటివిలే !
మానవత్వమన మాధవత్వమను
మార్గము చూపితివే !
— ఓం జయజయహెూమాతా !