1. Home
  2. Articles
  3. Mother of All
  4. గురు పూజా మహోత్సవము

గురు పూజా మహోత్సవము

Bhattiprolu Lakshmi Suguna
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 16
Month : October
Issue Number : 4
Year : 2017

ప్రిన్సిపాల్, మాతృశ్రీ ఓరియంటల్ కాలేజి – జిల్లెళ్ళమూడి సమాజాన్ని సంస్కారవంతంగా సమున్నతంగా తీర్చి దిద్దే గురుతర బాధ్యతను ఉపాధ్యాయులు నిర్వహిస్తున్నారని పొన్నూరు శ్రీ భావనారాయణ స్వామి ఓరియంటల్ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ డా. టి.ఎస్. దక్షిణామూర్తి శాస్త్రిగారు వివరించారు. ఉపాధ్యాయ దినోత్సవం 05-9-2017 మంగళవారం జిల్లెళ్ళమూడి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో జరిగిన గురుపూజోత్సవంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని తమ సందేశం అందించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా॥ బి.ఎల్. సుగుణగారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉభయ పరిషత్తుల అధ్యక్షులు శ్రీ బొప్పూడి రామబ్రహ్మం గారు మాట్లాడుతూ సమాజానికి ఉపాధ్యాయులు వెలుగు దివ్వెలని తెలిపారు. ప్రిన్సపాల్ డా॥ బి.ఎల్. సుగుణగారు మాట్లాడుతూ గురువర్యుల అనుగ్రహం వల్లనే అజ్ఞానాంధకారం తొలగిపోయి, విజ్ఞాన కాంతులు ప్రకాశిస్తున్నాయని సోదాహరణంగా వివరించారు. కార్యక్రమంలో ఆంగ్లభాష అధ్యాపకులు ‘అమ్మతోనేను’ పుస్తక రచయిత్రి మన్నవ సుబ్బలక్ష్మిగారు మాట్లాడుతూ దైవసమానుడయిన గురువుకు సమాజంలో సముచిత స్థానం లభించాలని తెలిపారు. అమ్మ భక్తులు శ్రీ టి.టి. అప్పారావుగారు, మాతృశ్రీ సంస్కృత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ కొండముది ప్రేమ్కుమార్ గారు విశ్రాంత సంస్కృత అధ్యాపకులు పూర్వ విద్యార్థి శిష్ట్లా వరప్రసాద్ గారు, విద్యార్థినీ విద్యార్థులు పూర్ణిమ, శోభనా, శివ తదితరులు “గురువందనం” సమర్పించారు.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!