ఆంధ్రదేశంలో ఇన్ని పంచాంగాలుండగా ఈ పంచాంగము విశిష్టత ఏమిటి ? ఇది నవీన దృగ్గణిత రీత్యా భారత ప్రభుత్వము వారిచే ఆమోదించబడింది. భారత కాలమానము గంటలు నిమిషములలో వ్రాయబడింది. ఈ పంచాంగములో వ్రతములు, పండుగలు, సెలవులు 1263 విశేషాలు తెలుపబడ్డాయి. దైనందిన లగ్నసారాణి, దేశాంతర సంస్కారచక్రములు కూడా ప్రదర్శింపబడ్డాయి.
మానవులు ఎందుకు యజ్ఞాలు చెయ్యాలి, చేస్తే వచ్చే లాభాలేంటి ? ఏ యాగం ఎప్పుడు చేయాలి ? ఏయే దేవతలు ఏలా అనుగ్రహిస్తారు అనే విషయాలు తెలియచేయ బడ్డాయి. సూర్య చంద్రులు, నక్షత్రాలు, గ్రహములు వంటి వాటి చలనం వల్ల కాల విశేషాలు ఏలా ఏర్పడుతున్నాయి విశేషంగా వివరింపబడ్డాయి.
పంచాంగంలోని తిథి, వార, నక్షత్ర, యోగ, నిర్వహించారు. కరణాలలో తిథివల్ల శ్రేయస్సు, వారం వల్ల ఆయుస్సు, నక్షత్రం వల్ల పాపం నశించటం, యోగం వల్ల రోగనివారణ, కరణం వల్ల కార్యసిద్ధి కలుగుతాయని, అవి చూచుకొని మన కనుకూలమైన సమయాలలో నడుచుకుంటే ఇహ పరసుఖాలు పొందవచ్చని తెలియచేశారు రచయిత. పంచాంగం హిందువుల కొక్కరికే కాదు యావత్ మానవజాతికి ఉపయోగపడేదనీ, సర్వమతస్థులు అనుసరించి లాభం పొందవచ్చని చెప్పుతూ ఇస్లాము, క్రిష్టియన్ శ్రీ అన్నపర్తి కృష్ణశర్మ సిద్ధాన్తి – ఫౌన్ : 9885442568 మతములకు సంబంధించిన పండుగలు కూడా ఇందులో చూపించారు.
జ్యోతిష సార్వభౌముడైన గారు గత 48 సంవత్సరాలుగా ఈ పంచాంగం వెలువరిస్తున్నారు. తెలుగు విశ్వవిద్యాలయంలోనూ, తంజావూరు ‘శాస్త్రా’ విశ్వవిద్యాలయంలోనూ జ్యోతిషవిభాగపు బోర్డుమెంబరు, జ్యోతిషానికి పట్టభద్ర స్థాయిలో సిలబస్ పుస్తకాలు వ్రాశారు. అంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవదాయశాఖ ఆగమ ఎడ్వయిజరీ బోర్డు సభ్యులు. జ్యోతిష బాలబోధిని, దేవీ పూజాకల్పము, ముహూర్త పారిజాతము, శ్రీకాళీశతకము, శ్రీ సూర్యసిద్ధాన్తము, జ్యోతిష విజ్ఞానచంద్రిక వంటి గ్రంథాలను సాధికారికంగా ప్రకటించారు. జాతక, ముహూర్త, సాముద్రిక, వాస్తు, ప్రశ్న, గ్రహ, శాంతి విధానాలలో ప్రావీణ్యం కలవారు. అనేక జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో పాల్గొని సమర్థునిగా గుర్తింపు పొందారు. ఎన్నో యజ్ఞాలు – ప్రతిష్ఠా కార్యక్రమాలు నిర్వహించారు.
జిల్లెళ్ళమూడి అమ్మసేవలో కొంతకాలం గడిపినవారు సంప్రదాయ కుటుంబానికి చెందిన వీరు, వీరి భార్య పార్వతి మంచి ఉపాసకులు. దృక్ సిద్ధాంత గణితమైన ఈ పంచాంగం ప్రతి ఇంట్లో ఉండతగ్గది.
ఎదురుగా వున్న వారి లోపం చెప్పుకోవాలి. దగ్గర లేని వారి మంచి చెప్పుకోవాలి.