ఘనమైనదీరోజు అమ్మపుట్టినరోజు
వేదవేదాంగాలు కీర్తించురోజూ
॥ఘన॥
శాంతియేలేనట్టి ప్రేమశూన్యంబైన
మానవులగావగా అమ్మ పుట్టినరోజు
॥ఘన॥
మరుగునే గురువుగా కరుణనే కర్మగా
మలచి యద్వైతమును బోధించు రోజూ
॥ఘన॥
తాడుపామూ లేని బ్రహ్మమే తానౌచు
బ్రహ్మాండమును ఏల నవతరించినరోజు
॥ఘన॥
రుధిరముద్గారమై ప్రేమయే మీరంగ
అమృతంబును పంచ అమ్మ పుట్టిన రోజు
॥ఘన॥
అన్నపూర్ణగతాను అవతరించిన రోజు
సత్యసుందరమైన సుగతినిచ్చిన రోజు
॥ఘన॥
అన్నినామంబులు రూపములు తానైన
ఆ మరుగు నిర్వచనసహితమైనా రోజు
॥ఘన॥