జగతికి మాతా పితరులు మీరే కదా
నమ్మి కొలుచు వారికన్ని సిరులే కదా
అవని వంటి అమ్మను తా శిరస్సున దాల్చె
వేయి పడగల వేల్పు శ్రీ నాగేశ్వరుడే కదా
సురలందరు నిలిచినారు సోదరులై అర్కపురిని
శివపార్వతులిట వెలయుట భాగ్యమే కదా
ఆకలొకటె అర్హతంటు అందరి ఇల్లంటు
అభయమిచ్చె అమ్మ మనసు అమృతమే కదా
అమితమైన ప్రేమను హైమమ్మను కన్నారు
హైమాలయమంటే ఇల మహిమాలయమే కదా