జగముల నేలే జననివి నీవేలే అమ్మా!
ఈ జగతికి మూలం నీవేలే అమ్మా!
ఈజగతికి మూలం నీవేలే అమ్మా!
అందరింటిలోన అవతరించిన అన్నపూర్ణవు
నీవేలే, మమతను పంచి మంచిని పెంచిన |
అనురాగదేవతవు నీవేలే అమ్మా! ॥జగముల॥
ఆదిపరాశక్తివి నీవేలే, ఆదీ అంతమూ నీవేలే |
సృష్టికి మూలం నీవేలే అమ్మా! ఈ జగతికి
మూలం నీవేలే అమ్మా!
నామాలు వేరైనా, రూపాలు వేరైనా, ॥జగముల॥
అన్ని నామాలూ నీవేలే, అన్ని రూపాలూ నీవేలే
ముగురమ్మల మూలపుటమ్మవు నీవేలే అమ్మా!
‘నేను నేనైన నేను’ నీవేలే, ఈ విశ్వానికే
జననివి నీవేలే అమ్మా! ఈ జగతిని ఏలే
జగజ్జననివి నీవేలే అమ్మా!॥ జగముల ॥