సాకీ….
ఓం జిల్లెళ్ళమూడి అమ్మ.. అనసూయమ్మ
వంద వసంతాల తల్లి వందనం కల్పవల్లీ
పల్లవి...
జిల్లెళ్ళమూడి అమ్మా కరుణించమ్మా
జగదేకమాత కనికరించమ్మ
కోరిన వరములియ్య వేడితిమ్మమ్మ
కొంగుబంగారమై జన్మించినావమ్మ
గుండెను కోవెల చేసితిమే
కుంకుమ పూజల కొలిచితిమే
జయ జగదీశ్వరి అఖిలాండేశ్వరి
జిల్లెళ్ళమూడి శ్రీమాత్రే నమః
చరణం 1…
ఇంద్రకీలాద్రిపై కనకదుర్గను పోలి
చంద్రశేఖర సతి పార్వతి వలే తెలిసి
అభయ మొసగి జగముల నేలి
కాశ్మీర శిఖరాన వైష్ణోదేవివై
భారతి పాదాన కన్యాకుమారివై
త్రేతాయుగమున జానకివై ద్వాపరయుగమున రుక్మిణివై
ఈ కలియుగమున అనసూయమ్మ నీవేనమ్మా….
చరణం 2….
విరించి చెంతగ నిలిచే వీణాపాణి
హరి హృదయాన నీవే సిరి శ్రీలక్ష్మి
పద్మప్రియ.. పద్మహస్తా….
ఆలంపురజ్యోతి జోగులాంబవే తల్లి
కలకత్తాపురిలోన కాళికాంబ జనయిత్రి
పరిపాలించే పెద్దమ్మ ….
భక్తుల బ్రోచే జగదాంబ….
భవతారిణీ శాంత స్వరూపిణి
ముగ్గురమ్మల మూలపుటమ్మ
జయము జయము అనసూయమ్మ…