1. Home
  2. Articles
  3. Viswajanani
  4. జిల్లెళ్ళమూడిలో డాక్టర్ పొత్తూరి వెంకటేశ్వరరావుగారి కళ్యాణ షష్టిపూర్తి మహోత్సవ పుష్పాలు

జిల్లెళ్ళమూడిలో డాక్టర్ పొత్తూరి వెంకటేశ్వరరావుగారి కళ్యాణ షష్టిపూర్తి మహోత్సవ పుష్పాలు

P P Bharghava
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 13
Month : June
Issue Number : 11
Year : 2014

26.4.2014న జిల్లెళ్ళమూడిలో అమ్మకుపూజ – శ్రీ సిద్ధేశ్వరానంద భారతీస్వామి 

(కుర్తాళం పీఠాధిపతి)కి పాదపూజ జరిగింది.

ఎనుబదియేండ్లు పైబడిన ఇక్కడ బాలుడ వమ్మవద్ద-నీ

 వనయము ముగ్గురమ్మలకు అచ్చట ముచ్చట తీర్చి-నేడు – స

 జ్జననుతుడౌ గృహస్థుగ ప్రశాంతపధమ్మున షష్టిపూర్తి- నీ 

ఘనమగు పుణ్యభూమిపయి కల్పన చేసితి -ప్రస్తుతించెదన్

 

అరువది యేండ్లు సాగిన గృహస్థపథమ్మున కష్టనష్టముల్

 ఇరువురు నొక్కటౌచు భరియించిరి -ప్రేమఫల ప్రసూనముల్

 మురిపెము చూపుచుండ-తమ ముందర పెద్దల ఆస్తిపాస్తులే 

కరిగిన లెక్కసేయక సుఖంకర జీవనయాత్ర సూత్రమై

 

లోకములోన నల్వురకు లోకువగాక ప్రతిష్ఠ కాంచుచున్

 ఈ కలిలో ప్రలోభములకెప్పుడు లొంగక-నిష్ఠ నిల్చు మీ

 పోక ప్రశంస చేసెదను – పొత్తూరివారిని పోల పత్రికా

 నీక ప్రపంచమందరుడు నిక్కము నిక్కము జర్నలిస్టులన్

 

శ్రీమతి సత్యవాణి తన చేతమునీయగ చేయిపట్టి ఓ

 ధీమహితుండవై తెనుగు తేజముగా వెలుగొందుచుంటివీ

 భూమిని – వెంకటేశ్వరుని పోడిమి మూలమెఱింగినాడ-నీ 

శ్రీమతికే నమస్కృతులు చేతును నిన్నిటు గొప్ప చేయుటన్

పిల్లల తీర్చిదిద్దినది పెన్నిధియై గృహలక్ష్మియౌచు నీ 

ఉల్లముకొల్లగొట్టినది ఉత్తమపత్నిగ -ఆతిధేయులన్

తల్లిని సేవతన్పినది-ధన్యత మన్మలు మన్మరాళ్ళు శో

 భిల్లగ తృప్తిగాంచినది – పెద్దలు పిన్నలు మెచ్చుచుండగన్

 

మహితవాత్సల్యమూర్తిదౌ మాతృపూజ

 కూర్మిమిత్రుడు శ్రీ జగద్గురుని పూజ 

కోరుకున్నట్లు జరిగె నీ తీరు మెత్తు 

సత్యభావుక వెంకటేశ్వరుడ వీవు !

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!